AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జియోకు భారీ షాకిచ్చిన ఎయిర్‌టెల్‌..! ట్రాయ్‌ నివేదికలో కీలక లెక్కలు

ట్రాయ్ జనవరి 2026 నివేదిక ప్రకారం భారత్ టెలికాం రంగంలో పోటీ తీవ్రమైంది. ఎయిర్‌టెల్ 4.4 మిలియన్ల కొత్త వినియోగదారులతో బలమైన వృద్ధి సాధించింది. రిలయన్స్ జియో 2.4 మిలియన్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, వీఐ 4.11 లక్షల వినియోగదారులను కోల్పోయి ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొంటోంది. బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లోనూ జియో, ఎయిర్‌టెల్ ఆధిపత్యం కొనసాగుతోంది, భవిష్యత్ మార్కెట్ దిశపై ఆసక్తి పెరుగుతోంది.

జియోకు భారీ షాకిచ్చిన ఎయిర్‌టెల్‌..! ట్రాయ్‌ నివేదికలో కీలక లెక్కలు
Airtel
SN Pasha
|

Updated on: Mar 22, 2026 | 9:12 PM

Share

భారత్ టెలికాం రంగంలో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నట్లు ట్రాయ్‌ (టెలికామ్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) తాజా నివేదిక స్పష్టం చేసింది. 2026 జనవరి గణాంకాల ప్రకారం ప్రముఖ టెలికాం సంస్థల మధ్య వినియోగదారుల పెరుగుదల, తగ్గుదలలో గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్‌ ఈ సంవత్సరాన్ని బలమైన ప్రారంభంతో మొదలుపెట్టింది. జనవరిలోనే 44 లక్షల కొత్త మొబైల్ వినియోగదారులను చేర్చుకోవడంతో, సంస్థ మొత్తం వైర్‌లెస్ చందాదారుల సంఖ్య 463.3 మిలియన్ల నుంచి 467.7 మిలియన్లకు పెరిగింది. ఇది ఎయిర్‌టెల్‌కు కీలకమైన వృద్ధి సంకేతంగా భావిస్తున్నారు.

ఇక రిలయన్స్‌ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2.4 మిలియన్ కొత్త వినియోగదారులను చేర్చుకోవడంతో, జియో మొత్తం వినియోగదారుల సంఖ్య 491.4 మిలియన్లకు చేరింది. తక్కువ ధరల డేటా ప్లాన్‌లు, విస్తృత నెట్‌వర్క్ విస్తరణ జియోకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. మరోవైపు వీఐ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా మారింది. జనవరి నెలలో సుమారు 4.11 లక్షల వినియోగదారులను కోల్పోవడంతో, సంస్థ మొత్తం వినియోగదారుల సంఖ్య 19.9 కోట్లకు పడిపోయింది. మార్కెట్ పోటీలో నిలబడటానికి Vi మరింత వ్యూహాత్మక చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బ్రాడ్‌బ్యాండ్ రంగం కూడా వేగంగా విస్తరిస్తోంది. మొత్తం బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 1.05 బిలియన్లకు చేరగా, జియో దాదాపు 49 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో ఉంది. ఎయిర్‌టెల్ 34 శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా, BSNL, Vi తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే భారత టెలికాం రంగంలో పోటీ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఎయిర్‌టెల్ వేగంగా పుంజుకుంటుండగా, జియో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటోంది. అదే సమయంలో Vi ఎదుర్కొంటున్న సవాళ్లు భవిష్యత్ మార్కెట్ దిశను సూచిస్తున్నాయి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us