ఎండలు పెరగడంతో వరంగల్లోని 35వ డివిజన్లో వీధి కుక్కల బెడద తీవ్రమవుతోంది. ఒంటరిగా వెళ్తున్న చిన్నారిపై కుక్కల మంద దాడి చేసింది. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను రక్షించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.