విశాఖపట్నం జిల్లా గాజువాకలోని ఎస్టీబీఎల్ శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో అరుదైన ఆధ్యాత్మిక అద్భుతం జరిగింది. ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలను సూర్యకిరణాలు నేరుగా తాకడం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ దివ్య సన్నివేశాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.