AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారుతున్న భారత రక్షణ వ్యూహం.. సైన్యంలో చేరిన మరో ‘ఈగిల్’ టీమ్.. ఇక శత్రువులకు చుక్కలే!

ఆధునిక యుద్ధంలో సరికొత్త గేమ్ ఛేంజర్‌గా డ్రోన్లు ఆవిర్భవిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి పశ్చిమ ఆసియా ఘర్షణల వరకు, యుద్ధంలో డ్రోన్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మారుతున్న యుద్ధ స్వరూపాన్ని గుర్తించిన భారత సైన్యం, తన సైనికులందరినీ డ్రోన్ యోధులుగా తయారు చేస్తోంది.

మారుతున్న భారత రక్షణ వ్యూహం.. సైన్యంలో చేరిన మరో ‘ఈగిల్’ టీమ్.. ఇక శత్రువులకు చుక్కలే!
Indian Defence Ashni Platoon
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Mar 22, 2026 | 10:46 AM

Share

ఆధునిక యుద్ధంలో సరికొత్త గేమ్ ఛేంజర్‌గా డ్రోన్లు ఆవిర్భవిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి పశ్చిమ ఆసియా ఘర్షణల వరకు, యుద్ధంలో డ్రోన్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మారుతున్న యుద్ధ స్వరూపాన్ని గుర్తించిన భారత సైన్యం, తన సైనికులందరినీ డ్రోన్ యోధులుగా తయారు చేస్తోంది. ఈగిల్ ఇన్ ది ఆర్మ్ ప్రతి సైనికుడి చేతిలో ఒక డ్రోన్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా ప్రతి సైనికుడు తన సాధారణ ఆయుధంతో పాటు డ్రోన్‌ను కూడా సమర్థవంతంగా ఉపయోగించగలగుతాడు. ఇది భవిష్యత్ యుద్ధంలో సైనికుడి చేతిలో ఒక ‘ఈగిల్’ (డ్రోన్) ఉండేలా చేస్తుంది. ఇది నిఘా, దాడి, లాజిస్టిక్స్, వైద్య సహాయం వంటి అన్ని రకాల కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది..

అష్ని ప్లాటూన్ డ్రోన్ విభాగం

డ్రోన్ దళంలో భాగంగా ప్రతి పదాతిదళ బెటాలియన్‌లో ‘అష్ని ప్లాటూన్’ (Ashni Platoon) అనే ప్రత్యేక డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే సుమారు 380 బెటాలియన్లలో ఈ ప్లాటూన్లు కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ విభాగాలు రికనైసెన్స్ డ్రోన్లు, స్ట్రైక్ డ్రోన్లు, కౌంటర్-డ్రోన్ వ్యవస్థలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇది యుద్ధభూమిలో భారత సైన్యానికి గణనీయమైన ఆధిక్యతను అందిస్తుంది.

సైనికులందరికీ డ్రోన్ శిక్షణ

ప్రస్తుతం భారత సైన్యం పదాతిదళ యూనిట్లలో ప్రాథమిక డ్రోన్ శిక్షణను పూర్తి చేసింది. ప్రతి సైనికుడు డ్రోన్‌లను నిర్వహించడం, ప్రాథమిక నిర్వహణ వంటి నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. రెండవ దశలో అధునాతన శిక్షణ జరుగుతోంది. ఇందులో ప్రత్యేక దాడులు, నిఘా, శత్రు డ్రోన్లను నిర్వీర్యం చేసే సాంకేతికతలు ఉన్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక డ్రోన్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA, డెహ్రాడూన్), ఇన్ఫాంట్రీ స్కూల్ (మౌల్), ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA, చెన్నై) వంటి ప్రముఖ సంస్థలలో డ్రోన్ శిక్షణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఆపరేషన్ సింధూర్ లో డ్రోన్ల విజయం

ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం డ్రోన్ల సామర్థ్యాన్ని బలంగా ప్రదర్శించింది. సొంత డ్రోన్లతో నిఘా, దాడి మిషన్లను విజయవంతంగా నిర్వహించడమే కాక, శత్రు డ్రోన్లను కూల్చి వేసింది. ఇది భారత డ్రోన్ యుద్ధ వ్యూహంలో ఒక మైలురాయి.

2027 నాటికి 100 శాతం డ్రోన్ శిక్షణ

భారత సైన్యం 2027 నాటికి పదాతిదళ సిబ్బందిలో అందరికీ పూర్తి డ్రోన్ ఆపరేషనల్ శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం బహుళ-అంచెల వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. డ్రోన్లు కేవలం దాడి ఆయుధాలుగా మాత్రమే కాకుండా, లాజిస్టిక్స్ సహాయం, గాయపడిన సైనికులను తరలించడం వంటి వైద్య అత్యవసర పరిస్థితుల్లో కూడా ఉపయోగపడతాయి. అదే సమయంలో, కౌంటర్-డ్రోన్ వ్యవస్థలతో శత్రు డ్రోన్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నారు. సమీప భవిష్యత్తులో యుద్ధ స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యం చేపట్టిన ఈ వ్యూహాత్మక చొరవ దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో కీలక భాగంగా మారనుంది.

వీడియో ఇక్కడ చూడండి…

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us