AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఏ సెలబ్రెటీ లేకుండానే అంతిమయాత్ర..

తెలుగు సినిమా ప్రపంచంలో వందలాది చిత్రాల్లో విలక్షణమైన నటనతో తనదైన ముద్ర వేసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అందులో ఓ నటుడి గురించి మాట్లాడుకుంటూ ఆయన మేనరిజం, యాక్టింగ్, డైలాగ్ చెప్పే విధానం ఆయనను సినీరంగంలోనే ప్రత్యేక ఇమేజ్ తెచ్చిపెట్టింది. కానీ ఆయన అంతిమయాత్రలో ఓ ఒక్క హీరో పాల్గొనలేదట.

Tollywood: ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఏ సెలబ్రెటీ లేకుండానే అంతిమయాత్ర..
Rao Gopal Rao
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2026 | 10:02 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు రావు గోపాల రావు. సినీరంగంలో ఆయన స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. తన విలక్షణమైన గొంతుతో.. తనదైన డైలాగ్ డెలివరీ, నటనతో విలనిజానికే కొత్త అర్థం చెప్పారు. తెరపై గంభీరంగా కనిపించే ఆయన.. స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు. విలనిజమే కాదు.. ఎమోషనల్ పాత్రలలోనూ ఆయన నటనతో ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. అయితే తెరపై ఎంతో గంభీరంగా కనిపించిన ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ఆయన చివరి రోజులకు సంబంధించిన కొన్ని విషయాలను ఆయన భార్య కమల కుమారి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షూటింగ్ సమయంలో రావుగోపాలరావు ఎంతో క్రమశిక్షణతో ఉండేవారని.. ఆయనకు పనిపట్ల ఎంతో గౌరవం ఉండేదని.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి మాత్రం సమయం ఇచ్చేవారని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..

పెద్ద స్టార్ నటుడు అయినప్పటికీ ఆయన జీవితం ఎంతో సాదాసీదాగా గడిపేవారని.. ఇంట్లో ఆహారపు అలవాట్లు సైతం సింపుల్ గా ఉండేవని అన్నారు. బయట స్టార్ నటుడు అయినప్పటికీ ఇంట్లో ఎంత సరళంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. అయితే నటుడిగా కెరీర్ పీక్స్ స్టెజ్ లో ఉన్నప్పుడే ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండేవని.. చివరి రోజుల్లో అవి తీవ్రమయ్యాయని ఆమె పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన తన వృత్తి పట్ల ఇష్టంతో సినిమా షూటింగ్స్ చేశారని అన్నారు. చివరకు అనారోగ్యంతో 1994 ఆగస్ట్ 13న 57 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా..

అయితే ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆ మహా నటుడికి అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో కానీ.. నిర్మాతగానీ హాజరు కాలేదట. కేవలం అల్లు రామలింగయ్య, పీఎల్ నారాయణ, రేలంగి, జై కృష్ణ వంటి స్టార్స్ మాత్రమే హాజరయ్యారట. అదే సమయంలో తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లిపోవడం..ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగడమే ఇందుకు కారణమని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆయన కుమారుడు రావు రమేష్ ప్రస్తుతం సినీరంగంలో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

Follow Us
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...
ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?
ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!