Gold Prices: భారీగా పతనమైన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే డౌన్.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. గత వారంలో భారీగా పెరగ్గా.. ఈ వారంలో భారీగా కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులే ఇందుకు కారణమని చెప్పవచ్చు. గత నాలుగు రోజుల్లో ఏకంగా రూ.9 వేలకుపైగా గోల్డ్ రేట్ తగ్గి ఊరటనిచ్చింది. సెప్టెంబర్ 3న బంగారం ధరలు ఇలా..

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ ఊరట దక్కింది. శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్ క్రమంలో గోల్డ్ రేట్లు భారీగా దిగొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు డౌన్ అవుతూ కొనుగోలుదారులకు ఊరట కల్గిస్తున్నాయని చెప్పవచ్చు. అంతర్జాతీయ పరిస్థితులే దీనికి కారణంగా నిలుస్తున్నాయి. డాలర్ మళ్లీ బలం పుంజుకోవడం, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలతో గోల్డ్, సిల్వర్ రేట్లు పతనమవుతున్నాయి. గత నాలుగు రోజుల్లో ఏకంగా రూ.9 వేల మేర ధర బంగారం ధర తగ్గింది. ఈ వారం ప్రారంభం నుంచే ధరలు పడిపోతూ వస్తోన్నాయి. సెప్టెంబర్ 3 తేదీన గురువారం ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.
తగ్గిన బంగారం ధరలు..
బంగారం ధరల్లో పతనం కొనసాగుతోంది. గురువారం కూడా ధరలు కుప్పకూలాయి. గంటల వ్యవధిలోనే ధరలు క్రాష్ అయ్యాయి. ఏ రోజుకు ఆ రోజు ధరలు వేగంగా మారుతున్నాయి. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలను చూస్తే..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,52,010 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,340 వద్ద ట్రేడవుతోంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,010గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,39,340 వద్ద ట్రేడవుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,010 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,340 వద్ద ట్రేడవుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,52,010 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,340గా ట్రేడవుతోంది.
-ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,160 వద్ద పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,490గా ట్రేడవుతోంది.
సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
-ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ.2,44,900 పలుకుతోంది
-హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది
-చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2,49,900గా కొనసాగుతోంది
-బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.45 లక్షలుగా ఉంది.
