SBI WhatsApp Banking: వాట్సాప్‌లోనే బ్యాంకింగ్ సేవలు.. బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ ఇలా చెక్ చేసుకోండి!
SBI WhatsApp Banking: ఇటీవల చేసిన లావాదేవీల వివరాలు తెలుసుకోవాలంటే Mini Statement ఎంపికను ఎంచుకోవచ్చు. SBI WhatsApp Banking ద్వారా మినీ స్టేట్‌మెంట్‌తో పాటు అకౌంట్ స్టేట్‌మెంట్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా..

SBI WhatsApp Banking: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ల కోసం WhatsApp Banking సేవలను అందిస్తోంది. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ నుంచే బ్యాలెన్స్ తెలుసుకోవడం, మినీ స్టేట్‌మెంట్ పొందడం, అకౌంట్ స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి పలు సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ సేవలు 24 గంటలు, 365 రోజులు అందుబాటులో ఉంటాయని SBI చెబుతోంది.
ఎస్‌బీఐ వాట్సాప్‌బ్యాంకింగ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
ముందుగా మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నంబర్‌నే WhatsAppకు లింక్ చేసి ఉండాలి. అనంతరం ఈ విధంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
- మీ ఫోన్‌లో +91 90226 90226 అనే అధికారిక SBI WhatsApp Banking నంబర్‌ను సేవ్ చేసుకోండి.
- WhatsApp ఓపెన్ చేసి ఈ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపండి.
- అవసరమైన ధృవీకరణ పూర్తయిన తర్వాత SBI WhatsApp Bankingలో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- అనంతరం మీకు అందుబాటులో ఉన్న బ్యాంకింగ్ సేవల మెనూ కనిపిస్తుంది.
వాట్సాప్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి?
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఎస్‌బీఐ అధికారిక వాట్సాప్ నంబర్‌కు “Hi” పంపి, కనిపించే మెనూలో Balance Enquiry ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో మీకు లింక్ అయిన ఖాతాల బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు.
మినీ స్టేట్‌మెంట్ కూడా పొందొచ్చు:
ఇటీవల చేసిన లావాదేవీల వివరాలు తెలుసుకోవాలంటే Mini Statement ఎంపికను ఎంచుకోవచ్చు. SBI WhatsApp Banking ద్వారా మినీ స్టేట్‌మెంట్‌తో పాటు అకౌంట్ స్టేట్‌మెంట్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇంకా ఏయే సేవలు ఉన్నాయి?
ఎస్‌బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా కేవలం బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ మాత్రమే కాకుండా అనేక సేవలను ఉపయోగించుకోవచ్చు.
- అకౌంట్ స్టేట్‌మెంట్
- హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ సర్టిఫికెట్లు
- డిపాజిట్ సర్టిఫికెట్
- టీడీఎస్ సర్టిఫికెట్
- పీపీఎప్‌కు సంబంధించిన సేవలు
- నామినీ వివరాల పరిశీలన/అప్‌డేట్
- డెబిట్ కార్డ్ సేవలు
- చెక్‌బుక్, డెబిట్ కార్డ్ స్టేటస్
- హోమ్, కార్, గోల్డ్, పర్సనల్, ఎడ్యుకేషన్ లోన్ల సమాచారం
- NRI సేవలు
- సమీప SBI ATM/బ్రాంచ్ వివరాలు
- ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్
- YONO, డిజిటల్ బ్యాంకింగ్ సమాచారం.
తెలుగులో కూడా SBI WhatsApp Banking:
ఎస్‌బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
SBI అధికారిక WhatsApp Banking నంబర్ +91 90226 90226 మాత్రమే. చాట్ చేస్తున్నప్పుడు WhatsAppలో Verified Business Account (బ్లూ టిక్) ఉందో లేదో పరిశీలించాలి. వాట్సాప్ బ్యాంకింగ్‌లో పూర్తి CIF నంబర్, పూర్తి అకౌంట్ నంబర్ లేదా CVV వంటి సున్నితమైన వివరాలను అడగదు. అలాగే ఎస్‌బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు ప్రత్యేకంగా ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేవని బ్యాంక్ పేర్కొంది. మొత్తంగా ఎస్‌బీఐ కస్టమర్లు సాధారణ బ్యాంకింగ్ అవసరాల కోసం బ్రాంచ్ లేదా యాప్ ఓపెన్ చేయకుండానే వాట్సాప్ ద్వారా అనేక సేవలను పొందవచ్చు. ముఖ్యంగా బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, అకౌంట్ స్టేట్‌మెంట్ వంటి సేవలు రోజువారీగా ఉపయోగపడతాయి.
గమనిక: ఎస్‌బీఐ అధికారిక WhatsApp నంబర్ +91 90226 90226ను మాత్రమే ఉపయోగించండి. తెలియని నంబర్లకు OTP, CVV, PIN వంటి వివరాలు ఎప్పుడూ ఇవ్వకండి.
ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లోని టాప్ 10 ప్రభుత్వ ఆస్పత్రులు ఇవే.. ఓపీ సేవలు, వైద్య సేవల వివరాలు..!
ఇది కూడా చదవండి: Petrol Pumps: పెట్రోల్ పంపు యజమానులకు ఈ సమస్య ఎందుకొస్తుంది? అసలు కారణం ఇదే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




