AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లోని టాప్ 10 ప్రభుత్వ ఆస్పత్రులు ఇవే.. ఓపీ సేవలు, వైద్య సేవల వివరాలు..!

Top 10 Govt Hospitals Hyderabad: ఈ ఆసుపత్రులు కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి అనేక ప్రత్యేక సేవలను అందిస్తాయి. అత్యవసర మరియు ప్రమాద చికిత్సలను 24/7 అందించడానికి ఇవి సిద్ధంగా ఉంటాయి. ఆధార్ కార్డ్, ఆరోగ్యశ్రీ లేదా ఇతర సంబంధిత ఆరోగ్య..

Hyderabad: హైదరాబాద్‌లోని టాప్ 10 ప్రభుత్వ ఆస్పత్రులు ఇవే.. ఓపీ సేవలు, వైద్య సేవల వివరాలు..!
Top Govt Hospitals
Subhash Goud
|

Updated on: Sep 23, 2026 | 12:22 PM

Share

Top 10 Govt Hospitals Hyderabad: హైదరాబాద్ నగరం కేవలం టెక్నాలజీ కేంద్రంగానే కాకుండా, విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు కూడా ప్రసిద్ధి చెందింది. ప్రజలకు అందుబాటు ధరలలో నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తాయి. సరసమైన చికిత్సలు, అత్యాధునిక సౌకర్యాలు మరియు నిపుణులైన వైద్యులతో, ఈ ఆసుపత్రులు అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నాయి. సాధారణ చికిత్సలు, ప్రత్యేక వైద్య సేవలు లేదా అత్యవసర పరిస్థితుల కోసం చూస్తున్న వారికి హైదరాబాద్‌లోని టాప్ 10 ప్రభుత్వ ఆసుపత్రుల జాబితా ఎంతో ఉపయోగపడుతుంది.

ఈ ఆసుపత్రులు కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి అనేక ప్రత్యేక సేవలను అందిస్తాయి. అత్యవసర మరియు ప్రమాద చికిత్సలను 24/7 అందించడానికి ఇవి సిద్ధంగా ఉంటాయి. ఆధార్ కార్డ్, ఆరోగ్యశ్రీ లేదా ఇతర సంబంధిత ఆరోగ్య కార్డులు ఉన్న వారికి ఈ ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స లభిస్తుంది.

హైదరాబాద్‌లోని టాప్ 10 ప్రభుత్వ ఆసుపత్రులు:

1. ఉస్మానియా జనరల్ హాస్పిటల్

ఈ ఆస్పత్రి నగరంలోని అఫ్జల్‌గంజ్ ఉంది. ఇక్కడ పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. సర్జరీలు, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, గైనకాలజీ వంటి అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ ఆస్పత్రిలో సోమవారం నుండి శనివారం వరకు ఓపీ సేవలు ఉదయం 8 గంటల నుంచే అందుబాటులో ఉంటాయి. అలాగే అత్యవసర సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

2. గాంధీ హాస్పిటల్:

ఈ ఆస్పత్రి ముషీరాబాద్, సికింద్రాబాద్ సమీపంలో ఉంది. ఇక్కడికి వెళ్లే పేషెంట్లకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జనరల్ మెడిసిన్, సర్జరీలు, పీడియాట్రిక్స్, గైనకాలజీ, సైకియాట్రీ వంటి సేవలు అందుబాటులోఉంటాయి. అలాగే పనివేళల విషయానికొస్తే సోమవారం నుండి శనివారం వరకు ఓపీ సేవలు ఉంటాయి. అలాగే అత్యవసర సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.

3. నీలోఫర్ హాస్పిటల్:

ఈ ఆస్పత్రి రెడ్ హిల్స్, లక్డీకపూల్‌లో ఉంది. ఇక్కడ సేవలు మాతా శిశు సంక్షేమం, పీడియాట్రిక్స్, నియోనాటాలజీ, గైనకాలజీ వంటివి ఉంటాయి. ఇక్కడ సోమవారం నుండి శనివారం వరకు ఓపీ సేవలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉంటాయి. అత్యవసర సేవలు మాత్రం 24/7 అందుబాటులో ఉంటాయి.

4. సరోజినీ దేవి ఐ హాస్పిటల్:

ఈ ఆస్పత్రి మెహదీపట్నం, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో ఉంది. ఈ ఆస్పత్రిలో ఆప్తమాలజీ, రెటీనా, కార్నియా, గ్లకోమా వంటి కంటి సంబంధిత చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ఈ హాస్పిటల్‌లో సోమవారం నుండి శనివారం వరకు ఓపీ సేవలు ఉంటాయి.

5. ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్:

ఈ ఆస్పూత్రి కోఠి, ఆంధ్ర బ్యాంక్ సమీపంలో ఉంది. ఇక్కడ చెవి, ముక్కు, గొంతు (ENT) సంబంధిత వ్యాధులకు చికిత్సలు, స్పీచ్ థెరపీ సేవలు అందుబాటు ఉంటాయి. ఇక్కడ సోమవారం నుండి శనివారం వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక అత్యవసర సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.

6. ప్రభుత్వ నిజామియా జనరల్ హాస్పిటల్:

ఈ జనరల్‌ హాస్పిటల్‌ మొగల్‌పురా, చార్మినార్ సమీపంలో ఉంది. యునాని మెడిసిన్, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీ, డెంటిస్ట్రీ, గైనకాలజీ, సర్జరీలు వంటి వైద్య సేవలు పొందవచ్చు. అలాగే ఇక్కడ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా అత్యవసర సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.

7. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్:

ఈ ఆస్పత్రి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో ఉంది. ఇక్కడ వైద్య సేవల విషయానికొస్తే.. మానసిక ఆరోగ్య సేవలు, పునరావాసం, సైకియాట్రీ వంటివి ఉంటాయి. ఈ ఆస్పత్రిలో సోమవారం నుండి శనివారం వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు ఉంటాయి. అలాగే అత్యవసర సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.

8. ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్:

ఈ ఆస్పత్రి సుల్తాన్ బజార్‌లో ఉంది. ఇక్కడ గైనకాలజీ, ప్రెగ్నెన్సీ సంబంధిత చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు పొందవచ్చు. అలాగే 24 గంటల పాటు అత్యవసర వైద్య సేలు అందుబాటులో ఉంటాయి.

9. ప్రభుత్వ హాస్పిటల్, నాంపల్లి:

ఈ ఆస్పత్రి నాంపల్లి మార్కెట్, బజార్ ఘాట్ సమీపంలో ఉంది. ఇక్కడ మెరుగైన సేవలు పొందవచ్చు. ఇక్కడ పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, సర్జరీ వంటివి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ అత్యవసర వైద్య సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి.

10. ప్రభుత్వ జనరల్ అండ్ చెస్ట్ హాస్పిటల్, బోరబండ:

ఈ ప్రభుత్వ ఆస్పత్రి స్వరాజ్ నగర్, బోరబండ, తులసీనగర్ సమీపంలో ఉంది. తల్లి, శిశు ఆరోగ్య సేవలు, ఇమ్యూనైజేషన్, ప్రివెంటివ్ హెల్త్‌కేర్, జనరల్ మెడిసిన్ వైద్య సేవలు పొందవచ్చు. ఇక్కడ సోమవారం నుండి ఆదివారం వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us