AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుమ్మడి గింజలు అమృతం అనుకుంటే పొరపాటే.. ఎక్కువగా తింటే ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవు!

ఈ రోజుల్లో చాలా మంది హెల్తీ స్నాక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా గుమ్మడి గింజలను (Pumpkin Seeds) డైట్‌లో చేర్చుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. వీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయనేది ఎంత నిజమో.. వీటిని మోతాదుకు మించి తింటే శరీరానికి అంతే కీడు జరుగుతుందనేది కూడా అంతే నిజం. గుమ్మడి గింజలను అతిగా తినడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Jun 29, 2026 | 8:25 AM

Share
కడుపు నొప్పి, విరేచనాలు: గుమ్మడి గింజల్లో డైటరీ ఫైబర్ (పీచుపదార్థం) చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ, ఒకేసారి పెద్ద మొత్తంలో గుమ్మడి గింజలను తింటే అది జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెంచుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు వచ్చే అవకాశం ఉంది.

1 / 5
అవాంఛిత బరువు పెరుగుదల: బరువు తగ్గాలనుకునే వారు గుమ్మడి గింజలను తింటుంటారు. కానీ, వీటిలో క్యాలరీలు, కొవ్వు శాతం కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిని స్నాక్స్ లాగా పరిమితి లేకుండా తింటూ పోతే, శరీరంలో క్యాలరీలు పెరిగిపోయి బరువు తగ్గడానికి బదులు మరింత బరువు పెరిగే ప్రమాదం ఉంది.

2 / 5
అలెర్జీలు, బీపీ తగ్గడం: కొంతమంది శరీర తత్వానికి గుమ్మడి గింజలు పడవు. అలాంటి వారిలో ఇది అలెర్జీని కలిగిస్తుంది. దీనివల్ల గొంతు నొప్పి రావడం, నిరంతరం తుమ్ములు రావడం, చర్మంపై దద్దుర్లు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా, ఇవి రక్తపోటును (Blood Pressure) తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, ఇప్పటికే లో-బీపీ ఉన్నవారు లేదా బీపీ టాబ్లెట్లు వాడేవారు వీటిని ఎక్కువగా తింటే బీపీ మరింత పడిపోయే ఛాన్స్ ఉంది.

3 / 5
గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం: గుమ్మడి గింజలు పరిమాణంలో చిన్నగా, కొద్దిగా గట్టిగా ఉంటాయి. చిన్న పిల్లలకు వీటిని నేరుగా ఇవ్వకూడదు, ఎందుకంటే అవి గొంతులో ఇరుక్కుపోయే (Choking Hazard) ప్రమాదం ఉంది. పెద్దలు కూడా వీటిని తినేటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా బాగా నమిలి మింగడం అలవాటు చేసుకోవాలి.

4 / 5
మ్మడి గింజలు ఆరోగ్యానికి మేలు చేయాలంటే వాటిని ఎల్లప్పుడూ మితంగానే తీసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు చెంచాల (Tablespoons) కంటే ఎక్కువ తీసుకోకపోవడం ఉత్తమం. ఏదైనా అమృతం అయినా అతిగా తింటే విషమే అవుతుందని గుర్తుంచుకోండి!

5 / 5
Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా

ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?

పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే

బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..

ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ

15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే

'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ

పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?

ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు

చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి