Whats App Features: వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో యూజర్లు ఉన్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దాదాపు దీన్ని ఉపయోగిస్తారు. ఇలాంటి యాప్ లు చాలా ఉన్నప్పటికీ వాట్సాప్ మాత్రమే సామాన్యులందరి వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ లో నిరంతరం అప్ డేట్లు జరుగుతున్నాయి.
యూజర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు కొత్తగా అదిరిపోయే శుభవార్త చెప్పింది. వాట్సాప్ ద్వారా చాట్ జీపీటీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. చాట్ జీపీటీ అనేది ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)తో పనిచేస్తుంది. దీని పూర్తి పేరు చాట్ జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ ఫార్మర్. ఆధునిక మెషిన్ లెర్నింగ్ సాంకేతికతతో ఇది మనకు సేవలు అందిస్తుంది. చరిత్ర, సైన్స్, టెక్నాలజీ, కోడింగ్, జనరల్ నాలెడ్జ్ ఇలా అన్ని విషయాలపై మనం అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెబుతుంది. గూగుల్ ను అడిగినట్టుగానే చాట్ జీపీటీని కూడా ప్రశ్నలు అడగాలి. దీనిలోని డేటా బేస్ నుంచి వెంటనే సమాధానం టెక్ట్స్ రూపంలో కనిపిస్తుంది. 2021లోపు జరిగిన ప్రతి అంశంలపై దీనిలో డేటా ఉంది.
చాట్ జీవీటీ సేవలు ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాటిని పొందటానికి ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ యాప్ లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ ద్వాారానే చాట్ జీపీటీ సేవలు పొందే అవకాశం ఉంది. దీని కోసం ప్రత్యేకంగా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోనవసరం లేదు. వాట్సాప్ లో చాట్ జీపీటీ సేవలు పొందడం చాలా సులభం. ముందుగా మీ కాంట్రాక్టు జాబితాలో 1-800-242-8478 అనే నంబర్ ను సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేసి, ముందుగా సేవ్ చేసుకున్న నంబర్ కు హాయ్ అనే మెసేజ్ పంపండి. దీంతో మీకు వాట్సాప్ నుంచి చాట్ జీపీటీని ఆపరేట్ చేసే వీలు కలుగుతుంది.
ఇక మీరు అనేక ప్రశ్నలు అడగవచ్చు. సమాధానాలు చాలా సూటిగా లభిస్తాయి. ప్రపంచంలోని ఏ విషయం గురించి అయినా చాట్ జీపీటీ మీకు సమాధానం ఇస్తుంది. వాట్సాప్ ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉంటుంది కాబట్టి, చాట్ జీవీటీ సేవలు పొందడం చాలా సులభంగా మారుతుంది. వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇప్పడు కొత్తగా వచ్చిన చాట్ జీపీటీ ఫీచర్ తో వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయి. మీ రోజు వారీ పనులను మరింత సులువుగా, సౌకర్యంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది. అలాగే వాట్సాప్ కూడా కొత్తగా మరికొన్ని ఫీచర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటిలో టైపింగ్ ఇండికేటర్ ఒకటి. దీని ద్వారా సందేశాన్ని ఎవ్వరు పంపుతున్నారో వినియోగదారులు గుర్తించడానికి వీలుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి