CNG: మీరు సీఎన్‌జీ వాహనాలను నడుపుతున్నారా? ఇవి గుర్తించుకోండి!
CNG Vehicles: రాజస్థాన్‌లో ఎల్‌పీజీ ట్యాంకర్‌ను సీఎన్‌జీ ట్యాంకర్ ఢీకొనడంతో ఏడుగురు మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ఈ ప్రమాదంలో 35 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే సీఎన్‌జీ వాహనాలు నడిపే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ఏ విధంగా అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే సీఎన్‌జీ గ్యాస్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జైపూర్-అజ్మీర్ హైవేపై ఎల్‌పీజీ ట్యాంకర్‌ను సీఎన్‌జీ ట్రక్కు ఢీకొట్టింది. దీని తర్వాత అనేక వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పెట్రోల్‌బంకు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురి మరణించారు. 35 మందికి పైగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించని విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. 5 రూపాయల నాణేల నిలిపివేత.. ఎందుకో తెలుసా?
CNG వాహనాలను నడుపుతున్నప్పుడు ఇవి గుర్తుంచుకోండి:
CNG వాహనాలు లేదా ట్రక్కులు నడుపుతున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీరు చేసే చిన్న పొరపాటు పెద్ద ప్రమాదాన్ని తెచ్చుకోవచ్చు. ఇది మరణానికి కూడా దారి తీస్తుంది. జైపూర్-అజ్మీర్ హైవేపై డ్రైవర్ రాంగ్ రూట్‌లో యూ టర్న్ తీసుకుని మరో ట్రక్కును ఢీకొట్టడంతో పేలుడు సంభవించింది. కానీ అనేక ఇతర కారణాలు ఉన్నాయి. జాగ్రత్త తీసుకోకపోతే, డ్రైవర్‌తో పాటు ప్రయాణీకుడికి కూడా సమస్యలు వస్తాయి.
- సీఎన్‌జీ వాహనాల్లో భద్రతా ఫీచర్లు ఉండటం ముఖ్యం. అటువంటి కార్లలో లీక్ డిటెక్షన్ సిస్టమ్, ప్రెజర్ చెకింగ్ సిస్టమ్ కలిగి ఉండటం అవసరం. దీనితో పాటు ప్రమాదాలు, గ్యాస్ లీకేజీ ప్రమాదాన్ని తగ్గించడానికి వాహనంలో షట్-ఆఫ్ వాల్వ్ కలిగి ఉండటం కూడా తప్పనిసరి.
- వాహనంలోని ఈ సేఫ్టీ ఫీచర్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇందుకోసం వాహనంలోని సీఎన్‌జీ కిట్, వాల్వ్‌లు, సీల్స్ అన్నీ పూర్తిగా బాగానే ఉండాలి. ఈ పరికరాల్లో ఏదైనా చెడిపోయినట్లయితే, వెంటనే మరమ్మతులు చేయాలి.
- CNG వాహనాల్లో ప్రయాణించే డ్రైవర్లు, ప్రయాణికులు కూడా భద్రతా మార్గదర్శకాల గురించి తెలుసుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం.
- మీరు మీ CNG కారును పార్క్ చేసే గ్యారేజీలో వెంటిలేషన్ ఉండటం ముఖ్యం. మెరుగైన పార్కింగ్ స్థలం కారణంగా, సిఎన్‌జి నుండి వెలువడే పొగ గ్యారేజీలో చిక్కుకోదు. అలాగే అది బయటకు రావడానికి సరైన స్థలం కూడా లభిస్తుంది.
- వాహనంలో సీఎన్‌జీ నింపేటప్పుడు ఇంధనాన్నిCNG ఫిల్లింగ్ స్టేషన్ నుండి మాత్రమే నింపాలని గుర్తుంచుకోండి.
- ఏదైనా అత్యవసర సమయాల్లో ఫోన్ నంబర్‌ను ఉంచుకోడం చాలా ముఖ్యం. ఏదైనా ప్రమాదం లేదా CNGకి సంబంధించిన ఏదైనా సమస్య సంభవించినప్పుడు మీరు అత్యవసర నంబర్‌ను సంప్రదించి సహాయం కోసం అడగవచ్చు.
ఇది కూడా చదవండి: YouTube: యూట్యూబర్లకు షాకింగ్ న్యూస్.. ఇక అలాంటి వీడియోలు తొలగింపు.. కీలక ప్రకటన!
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి