AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Charging Cable: బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా..?

ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్ కేబుల్ పాడైతే కొత్తది కొంటాం. అయితే బ్రాండెడ్ కేబుల్స్ కన్నా చౌకగా దొరికే ఇతర కేబుల్స్ వైపే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది డివైజుల్లోని బ్యాటరీ లైఫ్ను తినేయడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశముందని చెబుతున్నారు.

Charging Cable: బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా..?
Charging
Ravi C
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 21, 2024 | 1:01 PM

Share

ఎలక్ట్రానిక్ పరికరాలు పని చేయాలంటే ఛార్జింగ్​ ఎంతో అవసరం. ప్రతి డివైజ్​ కొన్నప్పుడు సదరు కంపెనీ ఛార్జింగ్​ కేబుల్​ను అందిస్తుంది. అయితే ఏదో ఒక సమయంలో అది పని చేయకుండా పోయినప్పుడు కొత్త కేబుల్​ కొనాల్సి వస్తుంది. అయితే, బ్రాండెడ్​​ కేబుల్​ కొనాలంటే కొద్దిగా ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే చాలా మంది చౌకైన కేబుల్స్​ వైపే మొగ్గు చూపుతారు. కానీ, ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డివైజుల జీవితకాలంపైనా ప్రభావం

చౌకగా దొరికే ఛార్జింగ్​ కేబుల్​ను ఉపయోగించడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి. ఇవేమీ తెలియకపోవడంతోనే వినియోగదారులు వాటిని కొనుగోలు చేసి వాడుతున్నారు. ఇటీవల కాలంలో వస్తున్న ఆధునిక స్మార్ట్​ ఫోన్లు ఇలాంటి కేబుల్స్​కు రక్షణ కలిగి ఉంటున్నాయి. వాటితో ఛార్జింగ్​ పెడితే అవి స్పందించవు. కానీ కొంచెం పాత  స్మార్ట్​ ఫోన్లు, ఇతర డివైజులకు మాత్రం వీటి నుంచి ఎలాంటి రక్షణ లేదు. ఇలాంటి కేబుల్స్​ వాడటం వల్ల డివైజులు కూడా చెడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది పరికరాల్లో బ్యాటరీ జీవితకాలంపైనా భారీ ప్రభావాన్ని చూపుతాయి.

అగ్ని ప్రమాదాలకూ ఆస్కారం

డివైజుల్లోని బ్యాటరీలు దాని పరిమితులు, కెపాసిటీని బట్టి పనిచేస్తాయి. కానీ, చౌక కేబుల్స్​ పరికరానికి అవసరమైన దాని కన్నా ఎక్కువ లేదా తక్కువ శక్తిని అందిస్తాయి. దీంతో క్రమంగా బ్యాటరీ లైఫ్​ క్షీణిస్తుంది. అంతేకాదు ఇలాంటి కేబుల్స్​ వాడకం వల్ల కరెంట్​ షాక్​ కొట్టే అవకాశం కూడా ఉందని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల వచ్చే చిన్నపాటి షాక్​తో​ పెద్ద వాళ్లకు ప్రమాదం లేకపోయినప్పటికీ  చిన్న పిల్లలకు ప్రాణాంతకం. అంతేకాకుండా కేబుల్స్​కు ప్లాస్టర్లు చుట్టి కూడా కొంతమంది వాడుతుంటారు. ఇది మరింత ప్రమాదకరం. ఇలాంటి కేబుల్స్​ వల్ల షార్ట్​ సర్క్యూట్​ అయి అగ్నిప్రమాదం జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి.

అందుకే ధర కాస్త ఎక్కువ అయినా.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ కాకుండా నాణ్యత కలిగిన కేబుల్స్ వినియోగించాలని నిపుణులు చూచిస్తున్నారు. లేదంటే అసలుకే నష్టం జరిగే అవకాశముంటుంది. అలాగే నాణ్యత కలిగిన కేబుల్స్ ద్వారా ఛార్జింగ్ వేగంగా అవుతుంది. మీ డివైజ్ కూడా సేఫ్‌గా ఉంటుంది.