Instagram Business: ఇన్‌స్టాగ్రామ్‌తో నెక్స్ట్ లెవల్ బిజినెస్ చేయొచ్చు! ఎలాగో చూసేయండి!
ఫొటోలు పోస్ట్ చేసుకోడానికి, ఛాటింగ్ చేయడానికే సోషల్ మీడియాని వాడే రోజులు పోయాయి. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక బిజినెస్ ప్లాట్ ఫామ్ గా మారింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెక్స్ట్ లెవల్ బిజినెస్ జరుగుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఇన్‌స్టాగ్రామ్ అనేది ఇప్పుడు కేవలం ఒక సోషల్ మీడియా మాత్రమే కాదు, ఇది నెక్స్ట్ జనరేషన్ మార్కెటింగ్ మీడియంలా మారింది. మార్కెటింగ్ చేసుకోవడానికి దీన్ని మించిన ఆప్షన్ లేదు. ముఖ్యంగా చిన్నచిన్న బిజినెస్‌లకు, ఫ్రీలాన్సర్లను ఇన్‌స్టాగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలు ఇన్‌స్టాని బిజినెస్ కోసం ఎలా వాడుకోవచ్చంటే..
హ్యాష్‌టాగ్స్
మీకు ఏదైనా చిన్న బిజినెస్ లేదా స్టోర్ ఉంటే.. ఇన్‌స్టాగ్రామ్ హ్యాష్‌టాగ్స్ ద్వారా మీ బిజినెస్‌ను ప్రమోట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీకో బేకరీ ఉంటే.. దాన్ని ప్రమోట్ చేయడం కోసం ‘#కప్ కేక్స్, #యమ్మీ డిజర్ట్స్..’ ఇలా నచ్చిన హ్యాష్‌టాగ్స్ జత చేస్తే.. ఆయా హ్యాష్‌టాగ్స్ ఫాలో అయ్యే వాళ్లందరికీ ఆ పోస్ట్ వెళ్తుంది. ఇలా మీకు దగ్గర్లో ఉన్న కస్టమర్స్ ను ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.
ఆన్‌లైన్ స్టోర్
ఇంటి నుంచే బిజినెస్ చేయాలనుకునేవాళ్లు ఇన్‌స్టాలో ఆన్‌లైన్ స్టోర్ తెరవచ్చు. ఇంట్లో ప్రొడక్ట్స్ తయారుచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్డర్స్ తీసుకుని డైరెక్ట్‌గా కస్టమర్లకు పంపొచ్చు. డిజైనింగ్, కన్సల్టెన్సీ, ఫ్రీలాన్సింగ్.. వంటి రకరకాల సర్వీసులు కూడా అందించొచ్చు.
ప్రమోషన్స్
బిజినెస్‌కు ఇంకా ఎక్కువ రీచ్ కావాలనుకుంటే ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రమోట్ చేయించొచ్చు. మీ బిజినెస్ డొమైన్‌ను బట్టి దానికి సూట్ అయ్యే ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
కంటెంట్ ద్వారా..
మీలో ఏదైనా టాలెంట్ ఉంటే మీరే ఇన్‌స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్స్ గా మారిపోవచ్చు. రీల్స్ చేస్తూ.. మీకంటూ కొంత ఫాలోయింగ్ పెంచుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్స్ చేయమని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ సంపాదించొచ్చు.
యూట్యూబ్
మీకు యూట్యూబ్ ఛానెల్ ఉంటే.. ఇన్ స్టా ద్వారా మీరు ఫాలోవర్లను పెంచుకోవచ్చు. మీ యూట్యూబ్ లో ఉండే కంటెంట్ గురించి ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. ఇక్కడ ఫాలోవర్స్ ను అక్కడ సబ్ స్క్రైబర్స్ గా మార్చుకోవచ్చు.
అఫిలియేట్ మార్కెటింగ్
రకరకాల ప్రొడక్ట్స్ లింక్స్ ను షేర్ చేస్తూ.. అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. ఉదాహరణకు ఏదైనా ఒక గ్యాడ్జెట్ కు సంబంధించిన వీడియో చేసి దాని ప్రొడక్ట్ లింక్ మీ ప్రొఫైల్ లో ఇవ్వొచ్చు. ఆ లింక్ ద్వారా ఎవరైనా ఆ ప్రొడక్ట్ కొనుగోలు చేస్తే మీకు కమీషన్ వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




