Zoho mail: జీమెయిల్ నుంచి జోహో మెయిల్‌కు మారాలా? ప్రాసెస్ చాలా సింపుల్!
స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన అరట్టై యాప్ రీసెంట్ గా ఎంత ట్రెండ్ అయిందో మనం చూశాం. అయితే అరట్టై యాప్ తో పాటు జీమెయిల్, క్రోమ్ వంటి మిగతా యాప్స్ ను కూడా స్వదేశీ యాప్స్ తో రీప్లేస్ చేస్తున్నారు చాలామంది. ముఖ్యంగ జీమెయిల్ నుంచి జోహో మెయిల్ కు మారుతున్నారు. ఇలా మీరు కూడా మారాలంటే ప్రాసెస్ చాలా సింపుల్!

Gmail To Zoho Mail
అరట్టై యాప్ ను డెవలప్ చేసిన జోహో సంస్థ.. జోహో మెయిల్, జోహో బ్రౌజర్ వంటి పలు యాప్స్, టూల్స్ ను కూడా డెవలప్ చేసింది. చాలామంది ప్రముఖులు కూడా జీమెయిల్ నుంచి జోహో మెయిల్‌కి మారాలని పిలుపునిచ్చారు. దీంతో అందరూ జోహో మెయిల్ ను డౌన్ లోన్ చేయడం మొదలుపెట్టారు. ప్రైవసీ ఉంటూ యాడ్స్ లేకుండా ఈ మెయిల్ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. జీమెయిల నుంచి ఇందులోకి ఎలా ఇంపోర్ట్ అవ్వాలంటే..
ప్రాసెస్ ఇలా..
మీరు ప్రస్తుతం వాడుతున్న జీమెయిల్ లోని కాంటాక్ట్స్, మెయిల్స్ ఏవీ కోల్పోకుండానే జోహో మెయిల్ కి మారొచ్చు.
- గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్‌స్టోర్ నుంచి జోహో మెయిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్ స్టాల్ చేసుకోవాలి.
- తర్వాత వ్యాపారం కోసం అయితే బిజినెస్ ఇమెయిల్, వ్యక్తిగతంగా అయితే పర్సనల్ ఇమెయిల్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ జీమెయిల్ లోకి వెళ్లి సెట్టింగ్స్ లో సీ ఆల్ సెట్టింగ్స్(See all settings)లోకి వెళ్లి ఫార్వార్డింగ్ అండ్ పాప్( Forwarding and POP/IMAP)పై క్లిక్ చేయాలి.
- తర్వాత IMAP ను ఎనేబుల్ చేయాలి.
- ఇప్పుడు జోహో మెయిల్‌లో సెట్టింగ్స్ లో Import/Export లోకి వెళ్లి అక్కడ మైగ్రేషన్ విజార్డ్ ద్వారా జీమెయిల్ నుంచి మీ ఇమెయిల్స్, ఫోల్డర్లు, కాంటాక్ట్స్ అన్నీ ఇంపోర్ట్ చేయొచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




