whatsapp safety: వాట్సాప్‌లో స్కామ్‌లకు చిక్కకుండా ఉండాలంటే ఇలా చేయాలి!
వాట్సాప్‌లో వచ్చే స్పామ్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా జరిగే స్కామ్స్ ద్వారా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారని కొన్ని స్టడీల్లో తేలింది. అసలు వాట్సాప్‌లో ఎలాంటి స్కామ్స్ జరుగుతాయి? వాటి బారిన పడకుండా సేఫ్ గా ఉండడం ఎలా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో వాట్సాప్ ను వాడని వాళ్లు ఎవరూ ఉండరు. అందుకే సైబర్ నేరగాళ్లకు వాట్సాప్ కూడా ఒక కేరాఫ్ గా మారింది. వాట్సా్ప్ ద్వారా స్కామ్స్ కు లెక్క లేదు. మెసేజ్‌లు, కాల్స్ చేసి పార్ట్-టైమ్ ఉద్యోగం ఇస్తామని, లోన్ ఇస్తామని ఆశ పెట్టడం నుంచి ఆఫర్స్ పేరుతో గ్రూపుల్లో యాడ్ చేయించడం వరకూ.. బోలెడు స్కామ్ లు. అసలు వీటి బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ప్రమోషనల్ కంటెంట్
వాట్సాప్ లో చాలా ప్రమోషనల్ మెసేజ్ లు వస్తుంటాయి. గ్రూప్స్ లో జాయిన్ అవ్వమని, లోన్ అప్లై చేయమని, లింక్ పై క్లిక్ చేసి ఆఫర్ క్లెయిమ్ చేసుకోమని.. ఇలా బోలెడు. ఇలాంటి మాయల్లో పడి వాళ్లు చెప్పింది చేస్తే.. అకౌంట్‌లో డబ్బు ఖాళీ అవ్వడం ఖాయం. కాబట్టి వాట్సాప్ ద్వారా వచ్చే ప్రమోషనల్ మెసేజ్ లకు దూరంగా ఉండడం మంచిది.
టూ ఫ్యాక్టర్’ అథెంటికేషన్
వాట్సాప్‌లో ఇలాంటి స్కామ్స్‌కు దొరక్కుండా ఉండాలంటే.. వాట్సాప్‌కు ‘టూ ఫ్యాక్టర్’ అథెంటికేషన్ పెట్టుకోవాలి. సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ పై క్లిక్ చేస్తే.. టూ స్టెప్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. దాన్ని ఆన్ లో ఉంచుకోవాలి. పిన్, ఇమెయిల్ ఐడీ ఇస్తే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ అవుతుంది. ఇది వాట్సాప్ ను ఎవరూ హ్యాక్ చేయకుండా అడ్డుకుంటుంది.
డోంట్ రిప్లై
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగినా, గ్రూపుల్లో చేరమని అడిగినా అనుమానించాలి. సైబర్ నేరగాళ్లు పెద్ద సంస్థల పేరుతో మోసాలు చేస్తుంటారు. అందుకే ఉద్యోగం, లోన్ పేరుతో కాల్స్ వచ్చినప్పుడు ఆయా సంస్థలకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. గుర్తు తెలియని నెంబర్ నుంచి వచ్చిన కాల్స్, మెసేజ్ లకు రిప్లై ఇవ్వకూడదు. అలాంటి అకౌంట్స్ గురించి వాట్సాప్ కు రిపోర్ట్ చేయాలి.
గ్రూప్స్/ కమ్యూనిటీస్
తెలియని వాట్సాప్ గ్రూప్స్ లేదా కమ్యూనిటీస్ లో ఉండొద్దు. గ్రూప్ చాట్స్‌లో లింక్స్, యాడ్స్ లాంటివి ఎక్కువగా కనిపిస్తుంటే ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వడం బెటర్. అనుమానిత మెసేజ్‌లు, కాల్స్ వచ్చినప్పుడు వీలైనంత వరకూ అవాయిడ్ చేయడం మంచిది. పొరపాటున సైబర్ మోసంలో చిక్కితే వెంటనే సైబర్ పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వాలి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




