Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Care Tips: మీ పిల్లలను స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉంచడం ఎలా? ఈ ట్రిక్స్‌ పాటించండి!

Child Care Tips: కొంతమంది తల్లిదండ్రులు కూడా రోజంతా మొబైల్‌తో బిజీగా ఉంటారు. కుటుంబం, పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి బదులుగా, మొబైల్ అలవాటుగా మారుతుంది. ఇది చూసి పిల్లలకు కూడా మొబైల్ చెడు అలవాటు వస్తుంది. పిల్లలకు మొబైల్‌ ఇవ్వడం వల్ల..

Child Care Tips: మీ పిల్లలను స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉంచడం ఎలా? ఈ ట్రిక్స్‌ పాటించండి!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 23, 2025 | 12:03 PM

ఈ రోజుల్లో పిల్లల్లో కూడా మొబైల్‌ అలవాటు విపరీతంగా పెరిగిపోతోంది. మీ పిల్లలకు కూడా మొబైల్ అలవాటు ఉంటే మానేయడానికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు మొబైల్‌ అలవాటు కారణంగా వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు పదేపదే చెబుతుంటారు. పిల్లలకు ఒక్కసారి మొబైల్‌ అలవాటు అయితే మాన్పించేందుకు చాలా కష్టం. అయితే చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డ రోజంతా మొబైల్‌తో బిజీగా ఉన్నాడని చెబుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా రోజంతా మొబైల్‌తో బిజీగా ఉంటారు. కుటుంబం, పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి బదులుగా, మొబైల్ అలవాటుగా మారుతుంది. ఇది చూసి పిల్లలకు కూడా మొబైల్ చెడు అలవాటు వస్తుంది. పిల్లలకు మొబైల్‌ ఇవ్వడం వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు పిల్లలు రహస్యంగా మొబైల్ ఫోన్లు వాడతారు. పిల్లలలో మొబైల్ ఫోన్ల అలవాటును వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

  1. చిన్న వయస్సులో పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకండి: అన్నింటిలో మొదటిది మీరు చిన్న వయస్సులో పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదు. మీ బిడ్డ మీతో ఉన్నప్పుడు వీలైనంత వరకు మొబైల్‌కు దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు మొబైల్‌తో బిజీగా ఉంటే, మిమ్మల్ని చూసిన తర్వాత పిల్లలు కూడా మొబైల్ తీసుకుంటారు. దీని వల్ల పిల్లలకు అలవాటు అవుతుంది.
  2. తినే ముందు మొబైల్‌ ఇవ్వకండి: అలాగే పిల్లలు ఆహారం తింటున్న సమయంలో మొబైల్‌ను ఇవ్వకండి. అలా చేస్తే ప్రతిసారి తినేముందు మొబైల్‌ ఇవ్వాల్సిందే. లేకుంటే వారు తినలేరు. అందుకే ముందు నుంచి మొబైల్‌కు దూరంగా ఉంచండి. పిల్లలను మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంచడమే సరైన పరిష్కారం. బహిరంగ ఆటలు లేదా కార్యకలాపాలలో వారిని నిమగ్నయ్యేలా చేయండి. మీరు సైక్లింగ్ కోసం పిల్లవాడిని బయటకు తీసుకెళ్లవచ్చు.
  3. ఇంటర్నెట్ లేదా వైఫైని ఆఫ్ చేయండి: మీ మొబైల్‌లో పని పూర్తయిన తర్వాత మీరు ఇంటర్నెట్ లేదా వైఫైని ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల పిల్లలు మొబైల్ వాడరు. మీ అనుమతి లేకుండా మీ పిల్లలు మొబైల్‌ని ఉపయోగించలేరు కాబట్టి మీ మొబైల్‌లో పాస్‌వర్డ్‌ను ఉంచండి.
  4. మొబైల్‌ను లాక్కోకండి: మీరు పిల్లల చేతిలో ఫోన్ చూసినట్లయితే, దానిని వెంటనే తీసుకోకండి. ఇది మీ బిడ్డకు కోపం తెప్పిస్తుంది. ప్రశాంతంగా వివరించి వారి నుంచి నుండి ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నించండి.
  5. టీవీ చూడటానికి కూడా సమయం కేటాయించండి: ఇంట్లో, పిల్లలను టీవీ చూడటం, పుస్తకాలు చదవడం, స్పీకర్‌లో పాటలు వినడం ద్వారా వినోదాన్ని పొందేలా ప్రోత్సహించండి. మీరు మీ పిల్లలు స్మార్ట్ టీవీని చూడటానికి సమయాన్ని కూడా షెడ్యూల్ చేయవచ్చు. టీవీ చూడటం వల్ల కూడా పిల్లల కంటిచూపుపై ప్రభావం పడుతుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి