AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Websites: నకిలీ వెబ్‌సైట్స్‌ మాయలో పడకుండా ఉండాలంటే.. ఇలా చేయండి!

ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసేవాళ్లు తరచూ బోలెడు వెబ్‌సైట్స్‌ను విజిట్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు తెలియక ఫేక్ వెబ్‌సైట్ లింక్స్ ను ఓపెన్ చేసి వైరస్ లేదా మాల్వేర్స్ బారిన పడే అవకాశం ఉంది. అచ్చం ఒరిజినల్ వెబ్‌సైట్‌లా కనిపించే ఈ నకిలీ వెబ్‌సైట్స్‌ను ఎలా గుర్తించొచ్చంటే..

Fake Websites: నకిలీ వెబ్‌సైట్స్‌ మాయలో పడకుండా ఉండాలంటే.. ఇలా చేయండి!
Fake Websites
Nikhil
|

Updated on: Sep 23, 2025 | 5:05 PM

Share

నకిలీ వెబ్‌సైట్స్ ద్వారా సైబర్ మోసాలకు గురవుతున్నవాళ్లు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్‌సైట్లు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సైట్స్, షాపింగ్ సైట్స్ కేటగిరీల్లో ఈ తరహా నకిలీ సైట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి వాటికి లాగిన్ అవ్వడం ద్వారా సిస్టమ్ హ్యాక్ అవ్వడమే కాక పర్సనల్, బ్యాంకింగ్ డీటెయిల్స్ వంటివి రిస్క్‌లో పడతాయి. అందుకే వెబ్‌సైట్ ఓపెన్ చేసేముందు కొన్ని విషయాలు చెక్ చేసుకోవాలి.

అడ్రెస్ బార్

ఏదైనా వెబ్​సైట్ ఓపెన్ చేసేముందు ముందుగా దాని డొమైన్ అడ్రెస్‌ను చెక్ చేసుకోవాలి. వెబ్​సైట్ యూఆర్‌‌ఎల్‌కు ముందు ‘హెచ్‌టీటీపీ(http)’ అని ఉందో, లేదో చెక్ చేసుకోవాలి. అలాగే అడ్రెస్ చివర్లో ‘డాట్‌కామ్(. com), డాట్ ఓఆర్‌‌జీ(.org), డాట్‌ఇన్(.in) వంటి కామన్ డొమైన్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. కొన్ని నకిలీ వెబ్ సైట్స్ కు  బ్యాంక్ నేమ్ సేమ్ టు సేమ్ ఉంటుంది. చివర్లో డొమెయిన్ మారుతుంది. అది చూసుకోకుండా వెబ్ సైట్ లోకి వెళ్తే మోసపోయే ప్రమాదం ఉంది.

ఆటో రీడైరెక్ట్

ఏదైనా వెబ్‌సైట్ లో ఏ ఆప్షన్ నొక్కినా.. వెంటనే వేరొక వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతుంటే అది ఒరిజినల్ వెబ్ సైట్ కాదని తెలుసుకోవాలి. ఈ తరహా వెబ్ సైట్స్ లో  ‘కాంటాక్ట్ అజ్’ లేదా ‘అబౌట్ అజ్’ వంటి ఆప్షన్లు కనిపించవు.

స్పెల్లింగ్

కొన్ని వెబ్‌సైట్స్ నేమ్స్‌లో స్పెల్లింగ్‌లో చిన్న మార్పు ఉంటుంది. అది సరిగ్గా చూసుకోకుండా క్లిక్ చేస్తే.. అది ఫేక్ అని తెలుసుకునేలోపు మీ డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.  ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు లేదా సబ్ స్క్రిప్షన్, షాపింగ్ వంటి వాటి కోసం పేమెంట్స్  చేసేముందు ఆ వెబ్‌సైట్స్‌కు సంబంధించిన రివ్యూలు చదవడం మంచిది. అసలైన వెబ్‌సైట్ అడ్రెస్ తెలుసుకుని ఒకటికి రెండు సార్లు వెబ్ అడ్రెస్ స్పెల్లింగ్‌ను చెక్ చేసుకోవాలి.

ఈ టూల్ ద్వారా..

ఇకపోతే వెబ్ బ్రౌజర్‌‌లో ఇంటర్నెట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఫేక్ వెబ్‌సైట్స్‌ను ఈజీగా గుర్తించే వీలుంటుంది.  లేదా  ‘వెబ్ ఆఫ్ ట్రస్ట్(web of trust)’ అనే వెబ్​సైట్‌లోకి వెళ్లి అక్కడ మీకు అనుమానం ఉన్న వెబ్ సైట్ అడ్రెస్ టైప్ చేసి అది ఒరిజినల్ అవునా? కాదా? అన్నది తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి