SBI Online: ఎస్బీఐ ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఎలా? ఇంట్లో నుంచే ఈజీగా చేసేసుకోవచ్చు..
ఎస్‌బీఐ వినియోగదారై ఉండి ఇప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోకపోతే వెంటనే చేసుకునేందుకు ఈ కథనం చివరి వరకూ చదవండి. బ్యాంక్ బ్రాంచ్ కూడా వెళ్లనవసరం లేకుండానే ఇంట్లో నుంచే ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అదెలాగో స్టెప్ బై స్టెప్ విధానం చూద్దాం..
ప్రస్తుతం మార్కెట్లో డిజిటల్ లావాదేవీలు అధికమయ్యాయి. చిరు వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ అందరూ మొబైల్ వ్యాలెట్లు వాడుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల సాయంతో ఎంచక్కా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసేస్తున్నారు. ఇంతలా డిజిటల్ పేమెంట్ ప్రజలకు కనెక్ట్ అయిపోయినప్పటికీ.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరిపే వారు చాలామందే ఉన్నారు. ఆన్‌లైన్ బ్యాకింగ్ ద్వారా షాపింగ్, ఫుడ్ ఆర్డర్ చేసే వారు కూడా ఉన్నారు.
అందుకనుగుణంగా అన్ని బ్యాంకులు కూడా తన ఆన్‌లైన్ వేదికపై పలు ఆఫర్లు రివార్డులు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ బ్యాంకింగ్. ఒక్కసారి ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయితే దానిలోనే సమస్తం చేసేయొచ్చు. ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి అన్ని సేవలను పొందవచ్చు. మీరు ఎస్‌బీఐ వినియోగదారై ఉండి ఇప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోకపోతే వెంటనే చేసుకునేందుకు ఈ కథనం చివరి వరకూ చదవండి. బ్యాంక్ బ్రాంచ్ కూడా వెళ్లనవసరం లేకుండానే ఇంట్లో నుంచే ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అదెలాగో స్టెప్ బై స్టెప్ విధానం చూద్దాం.. ఒక్కసారి ఇంటర్ నెట్ యాక్టివేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తే సేవలను ఫోన్ లేదా డెస్క్ టాప్ లేదా కంప్యూటర్ ద్వారా ఎక్కడి నుంచి సర్వీసులను పొందే అవకాశం ఉంది.
రిజిస్ట్రేషన్ విధానం ఇది..
- ఎస్‌బీఐ అధికారికి వెబ్ సైట్‌ను సందర్శించాలి. దానిలో రిటైల్ బ్యాంకింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆపై పర్సనల్ బ్యాంకింగ్‌ను ఎంపిక చేసుకొని కంటిన్యూ టు లాగిన్ ని క్లిక్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్లను అంగీకరిస్తున్నట్లు నిర్ధారించాలి.
- ఆ తర్వాత న్యూ యూజర్? రిజస్టర్ హియర్/యాక్టివేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆర్వాత న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ను ఎంపిక చేసుకోవాలి.
- అప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ఎస్‌బీఐ అకౌంట్ నంబర్, సీఐఎఫ్ నంబర్, బ్రాంచ్ కోడ్, కంట్రీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత ఫుల్ ట్రాన్జాక‌్షన్ రైట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ‘ఐ ఎగ్రీ’ అనే బటన్ పై క్లిక్ చేసి సబ్‌మిట్ బటన్ నొక్కాలి.
- ఆ తర్వాత మీ ఫోన్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని మళ్లీ ఎంటర్ చేసి కన్‌ఫర్మ్ చేయాలి.
- అప్పుడు మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ‘ఐ హావ్ మై ఏటీఎం కార్డ్’, ‘ఐ డూ నాట్ హావ్ ఏటీఎం కార్డ్’ అనే ఆప్షన్లలో మీరు మొదటికి సెలెక్ట్ చేసుకోవాలి.
- ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఏటీఎం కార్డు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మీకు ఏటీఎం లేకపోతే బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్‌ను సంప్రదించాలి.
- ఆ తర్వాత సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేస్తే తాత్కాలిక యూజర్ నేమ్ మీకు స్కీన్‌పై కనిపిస్తుంది.
- మీ నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ ను దానిలో సూచించిన విధంగా పెట్టుకొని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ తాత్కాలిక యూజర్‌ఐడీ, పాస్ వర్డ్ తో ఎస్‌బీఐ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత శాశ్వత యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకుంటే ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌ను ఈజీగా వినియోగించుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..