AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Netflix Password: నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌ని మీ స్నేహితులకు షేర్ చేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్..

నెట్​ఫ్లిక్స్​ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. పాస్​వర్డ్​ షేరింగ్​ను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేసింది.​ కేవలం ఓ ఇంట్లోని కుటుంబ సభ్యలు మాత్రమే ఒక అకౌంట్ ను వినియోగించే వీలుంటుంది. బయట వ్యక్తులకు షేర్ చేయాలంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Netflix Password: నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌ని మీ స్నేహితులకు షేర్ చేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్..
Netflix
Madhu
|

Updated on: May 24, 2023 | 5:00 PM

Share

మీరు మీ ఫ్రెండ్స్​తో నెట్​ఫ్లిక్స్​ పాస్​వర్డ్​ను షేర్​ చేసుకుంటున్నారా? అయితే మీకు బ్యాడ్​ న్యూస్​. ఇకపై మీరు అలా పాస్డ్ వర్డ్ ని షేర్ చేయలేరు. దీనిపై నెట్​ఫ్లిక్స్​ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. పాస్​వర్డ్​ షేరింగ్​ను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేసింది.​ కేవలం ఓ ఇంట్లోని కుటుంబ సభ్యలు మాత్రమే ఒక అకౌంట్ ను వినియోగించే వీలుంటుంది. బయట వ్యక్తులకు షేర్ చేయాలంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం అంతా ఓటీటీ హవా నడుస్తోంది. స్మార్ట్ టీవీల రాకతో వీటికి డిమాండ్ పెరిగింది. అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, జీ5, నెట్ ఫ్లిక్స్ వంటి ప్లాట్ ఫారంలకు జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్లాట్ ఫారంలు కూడా వినియోగదారులకు ఆకర్షించేందుకు పలు ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. అయితే కొన్ని ఓటీటలు పాస్ వర్డ్ షేరింగ్ ద్వారా డివైజ్ లలో వినియోగించే అవకాశం ఉంటుంది. నిన్నమొన్నటి వరకూ నెట్ ఫ్లిక్స్ కూడా ఇదే తరహా ప్లాన్లను అందించింది. అయితే అది మహా తలనొప్పి వ్యవహారంగా మారడంతో పాటు ఒకే లాగిన్ ఐడీ పాస్ వర్డ్ తో అనేక డివైజ్లు కనెక్ట్ అవడంతో నెట్ ఫ్లిక్స్ లాభాలకు కూడా గండి పడుతోంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ల వినియోగదరులు షేరింగ్ అకౌంట్లు వాడుతున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. బయటి వ్యక్తులతో పాస్ వర్డ్ షేరింగ్ ని నియంత్రించింది. ఒకవేళ బయట వ్యక్తులకు షేర్ చేయాలంటే అదనంగా డబ్బులు చెల్లించాలని పేర్కొంది.

ఈ మెయిల్ ద్వారా సమాచారం..

ఈ పెయిడ్ పాస్ వర్డ్ షేరింగ్ గురించి తన వినియోగదారులకు నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే సమాచారాన్ని అందించింది.యూనైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్ననీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ లతో సహా 103దేశాల్లోని వినియోగదారులకు ఈ మెయిల్ ద్వారా విషయాన్ని వెల్లడించింది. ఒక అకౌంట్ ఒక ఇంట్లోనే వినియోగించాలని.. మరో మెంబర్ ను యాడ్ చేయాలంటే అదనంగా చెల్లించాలని వివరించింది.

ఇవి కూడా చదవండి

అదనపు ఫీజు ఎంతంటే.. యూనైటెడ్ స్టేట్స్ లో ఈ ఫీజు నెలకు ఎనిమిది డాలర్లుగా ఉంది. యూకేలో 4.99 యూరోలు.

ఎలా పనిచేస్తుందంటే..

  • ఎక్స్ ట్రా మెంబర్స్ అనే ఆప్షన్ తీసుకుంటే వారికి కొత్త ప్రోఫైల్, పాస్ వర్డ్ ఇస్తారు.
  • ఆ కొత్త మెంబర్ ను ఆహ్వానించిన వ్యక్తి అదనపు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
  • ఆ అదనపు మెంబర్ కు ప్రత్యేకమైన నిబంధనలు, పరిమితులు ఉంటాయి.
  • ఒకే దేశంలో ని వారు మాత్రమే అదనపు వ్యక్తిని మెంబర్ గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఒక డివైజ్ లోనే వారు కంటెంట్ చూడటం కాని లేదా డౌన్ లోడ్ చేసుకోవడం గానీ చేయాల్సి ఉంటుంది.
  • ప్రత్యేకమైన ప్రోఫైళ్లను వారు అదనంగా క్రియేట్ చేయలేరు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..