AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

English Alphabets: ఇంగ్లిష్‌లో 27వ అక్షరం ఉందని మీకు తెలుసా? దాని హిస్టరీ తెలిస్తే షాక్ అవుతారు..

ఇంగ్లిష్‌లో ఎన్ని అల్ఫాబెట్స్ ఉంటాయి? అని అడిగితే.. ఠక్కున 26 అని కేజీ విద్యార్థి కూడా చెప్పేస్తాడు. సాధారణంగా ఆంగ్ల వర్ణమాలలో ‘A’ తో మొదలై ‘Z’ తో ముగిసే 26 అక్షరాలు ఉంటాయని మనందరికీ తెలుసు.. అయితే ఒకప్పుడు ఇంగ్లిష్ వర్ణమాల 27 అక్షరాలను కలిగి ఉండేదని మీకు తెలుసా? ఇది Z తర్వాత మరో అక్షరం కూడా వినియోగంలో ఉండేదని తెలుసా? నిజమేనండి..

English Alphabets: ఇంగ్లిష్‌లో 27వ అక్షరం ఉందని మీకు తెలుసా? దాని హిస్టరీ తెలిస్తే షాక్ అవుతారు..
English Alphabets
Madhu
|

Updated on: Jul 08, 2024 | 5:23 PM

Share

ఇంగ్లిష్‌లో ఎన్ని అల్ఫాబెట్స్ ఉంటాయి? అని అడిగితే.. ఠక్కున 26 అని కేజీ విద్యార్థి కూడా చెప్పేస్తాడు. సాధారణంగా ఆంగ్ల వర్ణమాలలో ‘A’ తో మొదలై ‘Z’ తో ముగిసే 26 అక్షరాలు ఉంటాయని మనందరికీ తెలుసు.. అయితే ఒకప్పుడు ఇంగ్లిష్ వర్ణమాల 27 అక్షరాలను కలిగి ఉండేదని మీకు తెలుసా? ఇది Z తర్వాత మరో అక్షరం కూడా వినియోగంలో ఉండేదని తెలుసా? నిజమేనండి.. 19వ శతాబ్దపు బ్రిటీష్ విద్యార్థులకు బోధించే విద్యా విధానంలో కూడా ఇది భాగంగా ఉండేది. అయితే గత శతాబ్దం ప్రారంభంలోనే ఈ 27వ అక్షరం కాస్త ‘గుర్తుగా’ మారిపోయింది. ఆ తర్వాత ఆధునిక ఆంగ్ల వర్ణమాల వ్యవస్థ నుంచి పూర్తి తొలగించారు. ఇంతకీ ఆ అక్షరం ఎంటో తెలుసా? మనందరికీ తెలిసిన గుర్తే.. ప్రస్తుతం మనం ‘అండ్’ అనే పదం వాడటానికి వినియోగిస్తుంటాం. దీనినే యాంపర్సండ్ లేదా ‘&’ అని కూడా పిలుస్తారు. ఇంగ్లిష్ వర్ణమాలలో చివరి అక్షరంగా దీనిని పరిగణిస్తారు. దీని సంఖ్య 27.

యాంపర్సండ్ అనే పేరు ఎలా వచ్చింది.

ఈ అక్షరాన్ని మొదట్లో ‘అండ్’ అని ఉచ్ఛరించేవారు. ఈరోజు కూడా ‘&’ గుర్తును కూడా అదే అర్థంలోనే వినియోగిస్తున్నాం. అయితే గతంలో ఇది జెడ్ తర్వాత వాడటంతో చాలా గందరగోళంగా ఉండేది. పైగా దీని పేరును ‘పర్ సె’ అని ఉచ్ఛరించేవారు. ప్రత్యేకించి ‘Z’ని అనుసరించే వర్ణమాలను చదివేటప్పుడు. ఈ ఉచ్చారణ ‘అండ్ పర్ సె అండ్’ అని ఉంటుండటంతో ఇబ్బందిగా మారింది. పదే పదే తప్పుడు ఉచ్చారణలు, ధ్వనులను క్రియేట్ చేసేంది. దీంతో కాలక్రమేణా అది ‘యాంపర్సండ్’ అనే పదంగా రూపాంతరం చెందింది.

యాంపర్సండ్ హిస్టరీ ఇది..

యాంపర్సండ్ చిహ్నం మూలాలను లాటిన్‌లో గుర్తించవచ్చు, ఇక్కడ ‘et’ అంటే ‘అండ్.’ ‘&’ అక్షరం ‘e’, ‘t’ అక్షరాలను కర్సివ్‌లో కలపడం నుంచి ఉద్భవించింది. పాపిరస్ ముక్కపై ఈ గుర్తు 45 ఏడీ నాటిది. దాదాపు వెయ్యి సంవత్సరాల తరువాత, 775 ఏడీలో, ఇది అధికారికంగా రోమన్ వర్ణమాలలో చేర్చబడింది.

15వ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కర్త అయిన జోహన్నెస్ గుటెన్‌బర్గ్, ప్రారంభ ముద్రణ వర్ణమాలలలో ఆంపర్‌సండ్‌ను చేర్చారు. 18వ శతాబ్దం నాటికి, దీనిని అధికారిక విద్యలో బోధించడం ప్రారంభమైంది. వర్ణమాలలో భాగంగా దాని చేర్చడం విశ్వవ్యాప్తంగా ప్రమాణీకరించబడలేదు. 20వ శతాబ్దం ప్రారంభం కాగానే, వర్ణమాలలలో సాధారణ ఉపయోగం ఆంపర్‌సండ్ తగ్గిపోతూ వచ్చింది. ప్రస్తుతం సింబల్ గా మాత్రమే దీనిని వినియోగిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..