Smart Phones: ఈ వారంలో స్మార్ట్‌ఫోన్‌ల జాతర.. టాప్ కంపెనీల స్మార్ట్ ఫోన్లు లాంచ్

అన్ని కంపెనీలు భారత మార్కెట్‌కు అనుగుణంగా సరికొత్త స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేయడానికి ఉత్సాహం చూపుతూ ఉంటాయి.  జూలై 2024 వారంలో అద్భుతమైన స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. జూలై 10న సామ్‌సంగ్ ఫోల్డబుల్ సిరీస్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే నథింగ్ సబ్-బ్రాండ్ సీఎంఎప్ బై నథింగ్ తన మొట్టమొదటి స్మార్ట్‌‌ఫోన్‌ను కూడా ఈ నెలలోనే లాంచ్ చేయనుంది.

Smart Phones: ఈ వారంలో స్మార్ట్‌ఫోన్‌ల జాతర.. టాప్ కంపెనీల స్మార్ట్ ఫోన్లు లాంచ్
Smartphone
Follow us
Srinu

|

Updated on: Jul 08, 2024 | 6:36 PM

భారతదేశంలో స్మార్ట్ ఫోన్‌ల వాడకం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అమెరికా, చైనా తర్వాత భారతదేశంలో అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడవుతాయి. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు భారత మార్కెట్‌కు అనుగుణంగా సరికొత్త స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేయడానికి ఉత్సాహం చూపుతూ ఉంటాయి.  జూలై 2024 వారంలో అద్భుతమైన స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. జూలై 10న సామ్‌సంగ్ ఫోల్డబుల్ సిరీస్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే నథింగ్ సబ్-బ్రాండ్ సీఎంఎప్ బై నథింగ్ తన మొట్టమొదటి స్మార్ట్‌‌ఫోన్‌ను కూడా ఈ నెలలోనే లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో టాప్ బ్రాండ్‌లు జూలై నెలలో లాంచ్ చేసే అవకాశం ఉన్న స్మార్ట్ ఫోన్ జాబితాపై ఓ లుక్కేద్దాం.

సీఎంఎఫ్ ఫోన్ 1

టాప్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ నథింగ్ సబ్-బ్రాండ్ అయిన సీఎంఎఫ్ తన మొదటి స్మార్ట్‌ఫోన్ సీఎంఎఫ్ ఫోన్ 1ని జూలై 8న భారతదేశంలో విడుదల చేస్తోంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్, అదనంగా 8జీబీ వర్చువల్ ర్యామ్‌కు ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 20,000 లోపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. 

రెడ్‌మీ 13 5జీ

ఎంఐ కంపెనీ భారతదేశంలో రెడ్‌మీ 13 5జీని జూలై 9న విడుదల చేయనుంది. ఈ బడ్జెట్ ఫోన్ క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌తో వస్తుంది. కలిగి ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌, 108 ఎంపీ డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉండే ఈ ఫోన్ ధర రూ.15,000 లోపు ఉండవచ్చని అంచనా.

ఇవి కూడా చదవండి

టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ 

టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ జూలై 9న కూడా ప్రారంభించనున్నారు. ఇది ఫుల్ హెచ్‌డీ ప్లస్+ రిజల్యూషన్‌తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల ఎల్‌సీడీ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ సెట్, 108 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్‌లో సుమారు రూ. 15,000 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. 

సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, ఫ్లిప్ 6

ఈ వారంలో అత్యంత ఉత్తేజకరమైన ఈవెంట్లలో ఒకటి “గెలాక్సీ అన్‌ప్యాక్‌డ్” ఈవెంట్ జూలై 10న పారిస్‌లో నిర్వహించనున్నారు. ఇక్కడ అది తన ఫోల్డబుల్ ఫోన్లకు సంబంధించిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6లను ఆవిష్కరిస్తుంది. రెండు మోడల్స్ ఇప్పటికే భారతదేశంలో ప్రీ-రిజర్వేషన్ కోసం అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ధర సుమారుగా రూ. 1,50,000గా ఉండవచ్చని అంచనా వేయగా, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 దాదాపు రూ. 80,000కు అందుబాటులో ఉండవచ్చు.

మోటో జీ85 5జీ

మోటోరోలా మోటో జీ85 5జీ ఫోన్‌ను జూలై 10న భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల కర్వ్ పీఓఎల్ఈడీ డిస్‌ప్లే, వేగన్ లెదర్ ఫినిషింగ్, వాటర్ రిపెల్లెంట్ డిజైన్ ఉన్నాయి. దీని ధర దాదాపు రూ.30,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.

లావా బ్లేజ్ ఎక్స్

లావా బ్లేజ్ ఎక్స్ ఫోన్‌ను జూలై 10న భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కర్వ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉన్నాయి. కచ్చితమైన ధర, లభ్యత వివరాలు ఇంకా ప్రకటించలేదు. అయితే ఇది అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

ఒప్పో రెనో 12

ఒప్పో రెనో 12 సిరీస్ జూలై 12న భారతదేశంలో ప్రారంభిస్తారు. రెనో 12, రెనో 12 ప్రోలతో కూడిన ఈ సిరీస్లో 120 హెచ్‌జెడ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్లతో వస్తుంది. ఏఐ మెరుగుదలతో ఎరేజర్ 2.0, ఏఐ బెస్ట్ ఫేస్, ఏఐ పర్ఫెక్ట్ షాట్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇవి ఫోటోగ్రఫీని మెరుగుపరచడానికి ఉద్దేశించి రూపొందించారు. ఈ ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..