Best Laptops: విద్యార్థుల కోసం బెస్ట్ ల్యాప్ టాప్‌లు ఇవే.. తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు.. 

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ల్యాప్ టాప్ ఉండాలని కోరుకొంటున్నారు. తక్కువ ధరలో బెస్ట్ ల్యాప్ టాప్ కావాలని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతి తక్కువ ధరకు మార్కెట్లో అత్యధికంగా అమ్మడవుతున్న 11 అంగుళాల ల్యాప్ టాప్ లను మీకు పరిచయం చేస్తున్నాం.

Best Laptops: విద్యార్థుల కోసం బెస్ట్ ల్యాప్ టాప్‌లు ఇవే.. తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు.. 
Asus Br1100 Notebook 12
Follow us
Madhu

|

Updated on: Jun 10, 2023 | 3:51 PM

ఇటీవల కాలంలో ల్యాప్ టాప్ ల వినియోగం గణనీయంగా పెరిగింది. హైబ్రిడ్ వర్క్ వాతావరణం, పిల్లల ఆన్ లైన్ క్లాసులు వంటివి పెరగడంతో పాటు విద్య డిజిటలీకరణ కావడం కూడా ల్యాప్ టాప్లకు డిమాండ్ ను పెంచింది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ల్యాప్ టాప్ ఉండాలని కోరుకొంటున్నారు. తక్కువ ధరలో బెస్ట్ ల్యాప్ టాప్ కావాలని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతి తక్కువ ధరకు మార్కెట్లో అత్యధికంగా అమ్మడవుతున్న 11 అంగుళాల ల్యాప్ టాప్ లను మీకు పరిచయం చేస్తున్నాం. ప్రముఖ ఈ ప్లాట్ ఫారం అమెజాన్ లో వాటి ధరలను కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరూ ఓ లుక్కేయండి..

అసుస్ బీఆర్1100 నోట్‌బుక్ 12..

సరసమైన ధరలో అత్యంత వేగవంతమైన పనితీరు అందించే ల్యాప్ టాప్ ఇది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 10-గంటల బ్యాటరీ లైఫ్‌ అందిస్తుంది. ఈ కాంపాక్ట్ 11-అంగుళాల ల్యాప్‌టాప్ దేశంలోని అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లలో ఒకటిగా నిలిచింది. దీనిలో 128జీబీ హార్డ్ డిస్క్, 4జీబీ ర్యామ్ ఉంటుంది. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది విద్యార్థులకు మంచి ఎంపిక. దీని ధర అమెజాన్ లో రూ. 20,990గా ఉంది.

లెనోవా ఐడియల్ ప్యాడ్ డీ330..

ఇది లైట్ వెయిట్ ల్యాప్ టాప్. యాంటీ గ్లేర్ స్క్రీన్ ని కలిగి ఉంది. ఈ ల్యాప్ టాప్ రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. దీనిలోని బ్యాటరీ రోజంతా పనిచేసినా అయిపోదు. దీనిలో ఇంటెల్ ప్రాసెసర్ ఉంటుంది. 11 అంగుళాల ల్యాప్ టాప్లలో ఇది బెస్ట్ ఆప్షన్. ఇది 128జీబీ హార్డ్ డిస్క్, 4జీబీ ర్యామ్ సైజ్ లో ఉంటుంది. విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ల్యాప్ టాప్ లో ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 26,990గా ఉంది.

ఇవి కూడా చదవండి

యాసర్ ట్రావెల్ మేట్ బిజినెస్ ల్యాప్ టాప్..

మన దేశంలోని బెస్ట్ 11 అంగుళాల ల్యాప్ టాప్ ఇది. దీనిలో ఇంటెల్ ప్రాససర్ ఉంటుంది. తక్కువ పవర్ తీసుకొని, అధిక పనితీరును అందస్తుంది. 12 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 128జీబీ హార్డ్ డిస్క్, 4జీబీ ర్యామ్ ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 29,999గా ఉంది.

హెచ్ పీ స్ట్రీమ్ 11 అంగుళాల ల్యాప్ టాప్..

అధిక పనితీరు కలిగిన బ్యాటరీ దీనిలో ఉంటుంది. ఇంటెల్ ప్రాసెసర్ ఉంటుంది. ఎంబడెడ్ మల్టీ మీడియా కార్డ్ ఉంటుంది. స్క్రీన్ రిజల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. 32 జీబీ హార్డ్ డిస్క్, 4జీబీ ర్యామ్ ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ధర అమెజాన్ సైట్లో రూ.34,169గా ఉంది.

హెచ్ పీ క్రోమ్ బుక్ 11 అంగుళాల ల్యాప్ టాప్..

ఈ ల్యాప్ టాప్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది. 15 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్ ఉంటుంది. మీడియా టెక్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్, ఆక్టా కోర్ సీపీయూ, జీపీయూ గ్రాఫిక్స్ ప్రాసెసర్స్, మల్టీ మీడియా ఇంజిన్ వంటి వి ఉన్నాయి. 32 జీబీ హార్డ్ డిస్క్, 4జీబీ ర్యామ్ సైజ్ ఉంటుంది. క్రోమ్ ఓఎస్ పై పనిచేస్తుంది. దీని ధర అమెజాన్ రూ. 44,752గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..