Smartphones Under 30k: కేక పెట్టించే కెమెరా క్వాలిటీ.. అదరహో అనిపించే ఫీచర్లు.. మిడ్ రేంజ్‌లో బెస్ట్ ఫోన్లు ఇవే..

ధర కాస్త ఎక్కువైన మంచి క్వాలిటీ కెమెరా, అధిక పనితీరు, మంచి బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మిడ్ రేంజ్ లో మంచి ఫీచర్లు.. ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు అధిక పనితీరు కలిగి ఉన్న ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిల్లో టాప్ బ్రాండ్లు అయిన గూగుల్ పిక్సల్, మోటోరోలా, నథింగ్ ఫోన్, వన్ ప్లస్, ఒప్పో, శామ్సంగ్ గేలాక్సీ వంటివి ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Madhu

|

Updated on: Jun 10, 2023 | 4:15 PM

గూగుల్ పిక్సల్ 6ఏ..
ఇటీవల ఈ ఫోన్ ధర తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ. 28,999గా ఉంది. ఇది చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. ఈ ఫోన్ కి హార్ట్ లాంటిది గూగుల్ టెన్సర్ చిప్. దీని ఆధారంగానే ఇది పనిచేస్తుంది. కెమెరా విషయానికి వచ్చే సరికి వెనుకవైపు 12.2ఎంపీ ప్రైమరీ లెన్స్, 12ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

గూగుల్ పిక్సల్ 6ఏ.. ఇటీవల ఈ ఫోన్ ధర తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ. 28,999గా ఉంది. ఇది చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. ఈ ఫోన్ కి హార్ట్ లాంటిది గూగుల్ టెన్సర్ చిప్. దీని ఆధారంగానే ఇది పనిచేస్తుంది. కెమెరా విషయానికి వచ్చే సరికి వెనుకవైపు 12.2ఎంపీ ప్రైమరీ లెన్స్, 12ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

1 / 5
మోటోరోలా ఎడ్జ్ 40..
ఇది కూడా చేతుల్లో ఇట్టే ఇమిడిపోతుంది. లైట్ వెయిట్ లోనే ఉంటుంది. దీనిలో 6.55 అంగుళాల పీఓఎల్ఈడీ హెచ్ డీఆర్ 10 ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. 144హెచ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డాల్డీ అట్మోస్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మీడియా టెక్ డెమెన్సిటీ 8020 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ లెన్స్ ఉంటాయి. దీని ధర రూ. 29,999గా ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 40.. ఇది కూడా చేతుల్లో ఇట్టే ఇమిడిపోతుంది. లైట్ వెయిట్ లోనే ఉంటుంది. దీనిలో 6.55 అంగుళాల పీఓఎల్ఈడీ హెచ్ డీఆర్ 10 ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. 144హెచ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డాల్డీ అట్మోస్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మీడియా టెక్ డెమెన్సిటీ 8020 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ లెన్స్ ఉంటాయి. దీని ధర రూ. 29,999గా ఉంది.

2 / 5
వన్ ప్లస్ నోర్డ్ 2టీ..
దీనిలో మీడియో టెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపీ మోనో లెన్స్ ఉంటాయి. 6.43 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే 90హెచ్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. దీనిలో 80వాట్ల కూడిన ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీని ధర రూ. 28,999 నుంచి ప్రారంభమవుతుంది.

వన్ ప్లస్ నోర్డ్ 2టీ.. దీనిలో మీడియో టెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపీ మోనో లెన్స్ ఉంటాయి. 6.43 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే 90హెచ్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. దీనిలో 80వాట్ల కూడిన ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీని ధర రూ. 28,999 నుంచి ప్రారంభమవుతుంది.

3 / 5
ఒప్పో రెనో 8టీ..
ఒప్పో రెనో 8టీ ఫోన్ సన్ రైజ్ గోల్డ్ వేరియంట్లో వస్తుంది. ఇది ఒక్కో యాంగిల్ ఓ ఒక్కో రకమైన కలర్లో కనిపిస్తుంది. ఇది చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. చేతిలో ఇట్టే ఇమిడి పోతుంది. దీనిలో 6.7 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. దీని ధర రూ. 29,999గా ఉంది.

ఒప్పో రెనో 8టీ.. ఒప్పో రెనో 8టీ ఫోన్ సన్ రైజ్ గోల్డ్ వేరియంట్లో వస్తుంది. ఇది ఒక్కో యాంగిల్ ఓ ఒక్కో రకమైన కలర్లో కనిపిస్తుంది. ఇది చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. చేతిలో ఇట్టే ఇమిడి పోతుంది. దీనిలో 6.7 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. దీని ధర రూ. 29,999గా ఉంది.

4 / 5
నథింగ్ ఫోన్ (1)..
ఇది ట్రాన్స్ పరెంట్ డిజైన్ లో ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ /128జీబీ  లేదా 12జీబీ/256జీబీ వేరియంట్లలో లభిస్తుంది. వెనుకవైపు 50ఎంపీ కెమెరా ఉంటుంది. 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే 120హెచ్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. దీని ధర రూ. 29,999గా ఉంది.

నథింగ్ ఫోన్ (1).. ఇది ట్రాన్స్ పరెంట్ డిజైన్ లో ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ /128జీబీ లేదా 12జీబీ/256జీబీ వేరియంట్లలో లభిస్తుంది. వెనుకవైపు 50ఎంపీ కెమెరా ఉంటుంది. 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే 120హెచ్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. దీని ధర రూ. 29,999గా ఉంది.

5 / 5
Follow us