Password: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటున్నారా..? మీ గొయ్యి మీరు తీసుకున్నట్లే.. కోట్ల మంది డేటా లీక్
మోస్ట్ కామన్ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నవారి డేటాను హ్యాకర్లు లీక్ చేయడం ఎప్పటినుంచో జరుగుతోంది. తాజాగా సిం21.6 మిలియన్ల మంది పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యాయి. వీళ్లు సింఫుల్‌గా పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారు. వారి వ్యక్తిగత వివరాలను డార్క్ వెబ్‌లో హ్యాకర్లు పెట్టడంతో.. ఇది సంచలనంగా మారింది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్, మెయిల్, ఫేస్‌బుక్ ఇలా ఏ ఫ్లాట్‌ఫామ్‌నైనా యాక్సెస్ చేయాలంటే అకౌంట్, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. కొంతమంది పాస్‌వర్డ్‌లను వెంటవెంటనే మర్చిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో పాస్‌వర్డ్‌లను మళ్లీ పెట్టుకుంటూ ఉంటారు. పాస్‌వర్డ్‌లను మార్చిపోకుండా ఉండేందుకు చాలామంది తమ నేమ్ లేదా 1234 అనే వరుస క్రమంలో నెంబర్లను సింపుల్‌గా పెట్టుకుంటారు. ఇలాంటివి పెట్టుకోవడం వల్ల అకౌంట్‌కు భద్రత ఉండదు. హ్యాకర్లు సులువుగా యాక్సెస్ చేసే ప్రమాదం ఉంటుంది.
తాజాగా కామన్ పాస్‌వర్డ్స్ పెట్టుకున్న మిలియన్ల మంది యూజర్ల డేటాను సైబర్ నేరగాళ్లు లీక్ చేశారు. వ్యక్తిగత వివరాలతో పాటు వారి అకౌంట్ డీటైల్స్, పాస్‌వర్డ్‌లను బయటపెట్టారు. చాలామంది తమ మెయిల్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ అకౌంట్లకు వీక్, గెస్సెబుల్ పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటున్నారు. దీని వల్ల హ్యాకర్లు సులువుగా యాక్సెస్ చేస్తున్నారు. తాజాగా లీక్ అయిన డేటా ప్రకారం ఎక్కువమంది పెట్టుకున్న వాటిల్లో 123456 పాస్‌వర్డ్ తొలి స్థానంలో ఉండగా.. admin పాస్‌వర్డ్ రెండో స్థానంలో ఉంది. ఇక password, qwery పాస్‌వర్డ్‌లను కామన్‌గా పెట్టుకుంటున్నారు.
టాప్ 25 మోస్ట్ కామన్ పాస్‌వర్డ్‌లు ఇవే
123456, admin,12345678, 123456789, 12345, password, Aa123456, 1234567890, Pass@123, admin123,1234567,123123, 111111, 12345678910,PAssword, Password, Aa@123456, admintelecom Admin@123, 112233, 102030 ,654321, abcd1234, abc123, qwerty123




