Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. ఆ పని చేయకపోతే మీ డేటా గోవిందా..!

ఇటీవల కాలంలో మనకు తెలియని విషయాన్ని గూగుల్ క్రోమ్‌లో సెర్చ్ చేయడం అనేది సర్వసాధారణమైపోయింది. చాలా మంది యూజర్లు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రిఫర్‌డ్ బ్రౌజర్‌లో పెట్టుకుంటున్నారంటే గూగుల్ క్రోమ్ ఆదరణ గురించి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్ వాడే వారిని ఇటీవల భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఐఎన్) డెస్క్‌టాప్ సిస్టమ్‌లలో గూగుల్ వినియోగదారులకు హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది.

Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. ఆ పని చేయకపోతే మీ డేటా గోవిందా..!
Google Chrome
Follow us
Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 11, 2024 | 10:07 PM

ఇటీవల కాలంలో మనకు తెలియని విషయాన్ని గూగుల్ క్రోమ్‌లో సెర్చ్ చేయడం అనేది సర్వసాధారణమైపోయింది. చాలా మంది యూజర్లు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రిఫర్‌డ్ బ్రౌజర్‌లో పెట్టుకుంటున్నారంటే గూగుల్ క్రోమ్ ఆదరణ గురించి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్ వాడే వారిని ఇటీవల భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఐఎన్) డెస్క్‌టాప్ సిస్టమ్‌లలో గూగుల్ వినియోగదారులకు హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. గూగుల్ వెబ్ బ్రౌజర్‌లో ఇటీవల అనేక బగ్స్‌ను గుర్తించినట్లు ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది. గూగుల్ క్రోమ్‌ను వాడితే రిమోట్ ఆధారంగా ప్రభావిత సిస్టమ్‌లపై ఏకపక్ష కోడ్‌ని అమలు చేయడానికి అనుమతించే అవకాశం ఉందని వివరిస్తున్నారు. కాబట్టి వినియోగదారులు తమ సిస్టమ్‌లను రక్షించుకోవడానికి తమ క్రోమ్ బ్రౌజర్‌లను వెంటనే అప్‌డేట్ చేయాలని కోరుతుంది. ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్ విషయంలో సీఈఆర్‌టీ-ఐఎన్ హెచ్చరికల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

సీఐవీఎన్ 2024-0231లో డెస్క్‌టాప్ కోసం గూగుల్ క్రోమ్‌లో వినియోగదారుల భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించే అనేక బగ్‌లను సీఈఐటీ గుర్తించింది. రిమోట్ అటాకర్‌లు టార్గెటెడ్ సిస్టమ్‌లపై ఏకపక్ష కోడ్‌ని అమలు చేసే అవకాశం ఉందని గుర్తించింది. ముఖ్యంగా ప్రత్యేక కోడ్‌ను రన్ చేయడం ద్వారా మన కంప్యూటర్ రిమోట్ కంట్రోల్‌ని తీసుకుని, సున్నితమైన డేటాను యాక్సెస్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. మన సిస్టమ్‌ను రిమోట్ ద్వారా యాక్సెస్ చేసుకున్నాక హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు లేదా సిస్టమ్‌ను పూర్తిగా ఆపి వేసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా హ్యాకర్లు మన కంప్యూటర్‌ను యాక్సెస్ చేయడం మొదలు పెట్టాక కంప్యూటర్ పనితీరులో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అలాగే గ్రాఫిక్‌లను రెండరింగ్ చేయడానికి క్రోమ్ ఉపయోగించే వెబ్ జీపీయూ డాన్‌లో తగినంత డేటా ప్రామాణీకరణ లేకపోవడంతో క్రోమ్‌ను హ్యాక్ చేసే అవకాశం ఉందని సీఈఐటీ గుర్తించింది. డాన్ ద్వారా అనధికార కోడ్‌ని మన సిస్టమ్‌లో రన్ చేసే అవకాశం ఉందని సీఈఐటీ హెచ్చరించింది. 

హ్యాకర్ల బారిన మన సిస్టమ్ పడకుండా ఉండాలంటే గూగుల్ క్రోమ్‌ను అప్‌డేట్ చేయాలని సీఈఐటీ సూచిస్తుంది. మీ క్రోమ్ బ్రౌజర్ తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేయాలని కోరుతుంది. క్రోమ్‌ను అప్ డేట్ చేయడానికి బ్రౌజర్ మెనుకి వెళ్లి హెల్ప్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం అక్కడ గూగుల్ క్రోమ్‌ను ఎంచుకుంటే బ్రౌజర్ ఆటో అప్‌డేట్ కోసం తనిఖీ చేసి, వాటిని ఇన్‌స్టాల్ చేస్తుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ప్రమాదాల నుంచి రక్షణగా ఉండడానికి గూగుల్ క్రోమ్‌లో ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ప్రారంభించాలి సీఈఐటీ సూచిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..