Google Translate: గూగుల్ ట్రాన్స్‌లేట్ కొత్త ఫీచర్ మామూలుగా లేదుగా.. వివరాలు తెలుసుకోండి
గూగుల్ ట్రాన్స్ లేట్ లో కొత్త ఫీచర్ వచ్చింది. ఇప్పటి వరకూ టెక్ట్స్‌ను మాత్రమే అనువదించే ఈ టూల్.. ఇకపై చిత్రాలపై ఉన్న కంటెంట్‌ను కూడా అనువదిస్తుంది. అదే టెక్ట్స్ తో ఇమేజ్ ను డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.

భాషా పరమైన ఇబ్బందులను గూగుల్ ట్రాన్స్‌లేట్ టూల్ పరిష్కరించింది. ఇది ప్రపంచంలోని దాదాపు అన్ని భాషలలోని కంటెంట్‌ని మనకు అర్థమయ్యే భాషలో అనువదించి అందిస్తుంది. ఇది చాలా మందికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు గూగుల్ దీనిని అప్‌గ్రేడ్ చేసింది. కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ టెక్ట్స్‌ను మాత్రమే అనువదించే ఈ టూల్.. ఇకపై చిత్రాలపై ఉన్న కంటెంట్‌ను కూడా అనువదిస్తుంది. అంటే మీరు ఏదైనా ఒక చిత్రాన్ని గూగుల్ ట్రాన్స్‌లేట్ లోకి వెళ్లి అప్‌లోడ్ చేస్తే.. దానిపై ఉన్న కంటెంట్ కూడా మనకు అవసరమైన భాషాలోకి అది అనువాదం అయిపోతోంది. అదే ఇమేజ్ ని మనకు కావాల్సిన భాషలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎలా చేయాలి..
మీరు గూగుల్ ట్రాన్స్‌లేట్ వెబ్ సైట్‌లోకి వెళ్తే.. మీకు ఆ పేజీ పైన టెక్ట్స్, వెబ్‌సైట్స్, డాక్యూమెంట్ ఆప్షన్స్ తో పాటు ఇమేజ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు ఓ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దానిలో ఫోటోని అప్ లోడ్ చేయమని అడుగుతుంది. జేపీజీ, జేపీఈజీ, పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఫొటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా అప్‌లోడ్ చేయగానే దానిపై ఉన్న కంటెంట్ మొత్తం మనకు అవసరమైన భాషలోకి అనువాదం అవుతుంది. ఈ టూల్ దాదాపు 132 భాషలను సపోర్టు చేస్తుంది. అంటే 132 భాషల్లోకి సులువుగా అనువాదం చేస్తుంది. అనువాదం చేయడం మాత్రమే కాక, ఒరిజినల్ చిత్రాన్ని పక్కనే ఉంచి దీనిని చూసుకోడానికి ఇది అనుమతిస్తుంది. అలాగే ట్రాన్స్‌లేట్ అయిన టెక్ట్స్‌తో ఇమేజ్ ని మీరు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు కూడా.
గతంలోనూ ఉన్నా..
గూగుల్ లెన్స్‌లో వినియోగించే ఏఆర్ ట్రాన్స్‌లేట్ టూల్ జీఏఎన్(జనరేటివ్ అడ్వసరియల్ నెట్‌వర్క్)నే ఇక్కడ కూడా వాడారు. గూగుల్ లెన్స్ లో చాలా కాలం నుంచి ఇమేజ్ ట్రాన్స్‌లేషన్ ఉంది. ఇప్పుడు అందించిన లేటెస్ట్ వెర్షన్‌లో మేజిక్ ఎరేజర్ అనే టెక్నాలజీని వినియోగించారు. ఇది ట్రాన్స్‌లేట్ చేసిన టెక్ట్స్ ని దానిపై సూపర్ ఇంపోజ్ చేయకుండా కొత్తగా ఇమేజ్ క్రియేట్ చేసి దానిలో అనువదించిన కంటెంట్ ని రిప్లేస్ చేస్తుంది.



మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..