Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar electric car: కిలోమీటరుకు కేవలం రూ. 80 పైసలే ఖర్చు.. ఈ కారును చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

పూణేకు చెందిన వేవ్ మొబిలిటీ అనే స్టార్టప్ ఎవా పేరుతో సోలార్ ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ కారు అన్ని పరీక్షలను పూర్తి చేసుకొని మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది.

Solar electric car: కిలోమీటరుకు కేవలం రూ. 80 పైసలే ఖర్చు.. ఈ కారును చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..
Solar Car Eva
Follow us
Madhu

|

Updated on: Mar 12, 2023 | 11:31 AM

అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలో వాహనదారులు ప్రత్యామ్నాయం వైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ శ్రేణి వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే చార్జింగ్ స్టేషన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో వాహనదారులు ఆ వాహనాల కొనుగోలు చేయాలంటే ఆలోచిస్తున్నారు. ఈక్రమంలోనే పూణేకు చెందిన ఓ స్టార్టప్ ఓ అడుగు ముందుకేసింది. దేశంలోనే మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కార్ ను ఆవిష్కరించింది. త్వరలోనే దీనిని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సోలార్ పవర్ తో పాటు దీనిలోని బ్యాటరీ విద్యుత్ తో కూడా చార్జ్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టెస్టింగ్ లు కూడా పూర్తయ్యాయి. ఇక రోడ్డుపై రావడమే ఆలస్యం. ఈ క్రమంలో మరోసారి దీనిలోని ఫీచర్లు, రేంజ్ వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వేవ్ మొబిలిటీ ఎవా..

పూణేకు చెందిన వేవ్ మొబిలిటీ అనే స్టార్టప్ ఎవా పేరుతో ఈ కారును రూపొందించింది. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ కారు అన్ని పరీక్షలను పూర్తి చేసుకొని మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే దీనిని అధికారికంగా లాంచ్ చేసే తేదీని ఆ కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కారుపై బజ్ క్రియేట్ అయ్యింది. చాలా మంది వినియోగదారులకు దాని బుకింగ్స్ కోసం ఇంటర్నెట్ లో పెద్ద ఎత్తున సర్చింగ్స్ జరుగుతున్నాయి. ఇది టూ సీటర్ కారే గానీ ముగ్గురు ప్రయాణించవచ్చు. ఇద్దరు పెద్దలు, ఒక పిల్లవాడు కూర్చొని ఎంచక్కా ప్రయాణించవచ్చు. ఈ కారు రెండు మోటార్‌సైకిళ్లకు సమానమైన వెడల్పును కలిగి ఉంటుంది. పొడవు చాలా తక్కువగా ఉంటుంది. సిటీ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పట్టగలదు.

45 నిమిషాల్లో చార్జ్ అవుతుంది..

సాధారణ ప్లగ్-ఇన్ ఛార్జర్‌తో కారును దాదాపు 4 గంటల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. అదే సమయంలో, దాని అతిపెద్ద యూఎస్పీతో కేవలం 45 నిమిషాల్లో 80 శాతం వరకు చార్జ్ చేయవచ్చు. అయితే కారుతో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇవ్వలేదు. అయితే భవిష్యత్తులో ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ కు కారును అప్ గ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది

ఇవి కూడా చదవండి

సోలార్ ప్యానెల్ ఎక్కడ ఉంటుందంటే..

ఎవా కారులతో సోలార్ ప్యానెల్ దాని పైకప్పు పైన అమర్చబడి ఉంటుంది. దీని కారణంగా ఇది పెద్ద ఉపరితల వైశాల్యాన్ని పొందుతుంది. దీని రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. కిలోమీటరుకు కేవలం 80 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ఈ కారు కేవలం సౌరశక్తితో ప్రతిరోజూ 10-12 కి.మీల వరకు నడుస్తుంది. ఇది సంవత్సరానికి 3,000 కి.మీ. ప్రయాణిస్తుంది. ఒక సాధారణ కారు సంవత్సరానికి సగటున 9,000 కి.మీ ప్రయాణిస్తుంది. అంటే ఈ కారు వినియోగం వల్ల ఈ ఇంధన ఖర్చులో మూడింట ఒక వంతు సౌరశక్తి వల్ల తగ్గే అవకాశం ఉంటుంది.

మూడు డ్రైవింగ్ మోడ్‌లు..

కారులో మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇందులో రివర్స్‌తో పాటు ఎకో, సిటీ మోడ్ ఆప్షన్ ఉంది. ఎకో మోడ్‌లో కారు పరిధి చాలా బాగుంది. ఈ మోడ్ లో సింగిల్ చార్జ్ లో ఇది 250 కి.మీ. వరకు పరిధిని ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..