Paytm UPI LITE: బ్యాంక్ సర్వర్ సమస్యలకు చెక్.. సింగిల్ క్లిక్‪తో పేమెంట్ పూర్తి.. పిన్ కూడా అవసరం లేదు..

క్యూఆర్ కోడ్ సాయంతో లావాదేవీలు చేసే సమయంలో ఒక్కో సారి బ్యాంక్ సర్వర్ డౌన్ అయ్యి, పేమెంట్స్ ఫెయిల్ అవుతుంటాయి. అలాంటి సమస్యలు చెక్ పెట్టేందుకే పేటీఎం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీనికి పిన్ అవసరం లేదు. బ్యాంకుతో కూడా సంబంధం లేదు.

Paytm UPI LITE: బ్యాంక్ సర్వర్ సమస్యలకు చెక్.. సింగిల్ క్లిక్‪తో పేమెంట్ పూర్తి.. పిన్ కూడా అవసరం లేదు..
Paytm
Follow us

|

Updated on: Mar 11, 2023 | 11:11 PM

పేటీఎం.. మన దేశంలో ఒక ట్రెండ్ సెట్టర్. క్యూ ఆర్ సాయంతో డిజిటల్ లావాదేవీలను ప్రతి ఒక్కరి దగ్గరకు తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యింది. చిన్న వీధి వ్యాపారి దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల వరకూ యూపీఐ పేమెంట్స్ చేసేలా ప్రోత్సహించింది. ఫలితంగా దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు అనుకున్నదానికంటే వేగంగా పెరిగాయి. ఇదే క్రమంలో మరింత వేగవంతంగా, సులభంగా లావాదేవీలు చేపట్టేందుకు మరో కొత్త అప్డేట్ ను పేటీఎం తీసుకొచ్చింది. పేటీఎం యూపీఐ లైట్ పేరిట కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఎటువంటి పాస్ వర్డ్ లేకుండానే మినిమం పేమెంట్ చేసేలా అవకాశం కల్పిస్తోంది. బ్యాంక్ తో కూడా పని లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పిన్ అవసరం లేకుండానే..

సాధారణంగా మీరు పేటీఎం ద్వారా చెల్లింపులు చేయాలంటే నాలుగు అంకెల పిన్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు షాప్‌లో రూ.10కి టీ తాగినా లేదా రూ.50, రూ.100తో బ్రేక్‌ఫాస్ట్ చేసినా, చెల్లింపును పేటీఎం చేసేటప్పుడు, ఆ సమయంలో మీ పిన్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ యూపీఐ లైట్ ఫీచర్‌ తో అటువంటి చిన్న చెల్లింపుల కోసం మీరు మళ్లీ మళ్లీ పిన్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు పిన్‌ను ఎంటర్ చేయకుండానే చిన్న లావాదేవీలు ఒక్క క్లిక్ తో పూర్తి చేయవచ్చన్న మాట.

బ్యాంకు సర్వర్ సమస్యలకు చెక్..

క్యూఆర్ కోడ్ సాయంతో లావేదేవీలు చేసే సమయంలో ఒక్కో సారి బ్యాంక్ సర్వర్ డౌన్ అని, బ్యాంకులో టెక్నికల్ సమస్య అని ఓ డైలాగ్ బాక్స్ వచ్చి మీ పేమెంట్స్ ఫెయిల్ అవుతుంటాయి. అలాంటి సమస్యలు చెక్ పెట్టేందుకే పేటీఎం ఈ పిన్ అవసరం లేని, బ్యాంకుతో సంబంధం లేని లావాదేవీల ఫీచర్ ని తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

రూ. 200 వరకూ మాత్రమే..

పేటీయం యూపీఐ లైట్ ద్వారా మీరు పిన్ అవసరం లేకుండా రూ.200 వరకు మాత్రమే చెల్లింపులు చేయవచ్చు. అలాగే మీరు ఒక రోజులో పేటీఎం యూపీఐ లైట్ వాలెట్‌కి కేవలం రూ. నాలుగు వేలు మాత్రమే యాడ్ చేయగలుగుతారు. దీనిపై ఎటువంటి చార్జీలు వసూలు చేయరు.

అన్ని బ్యాంకులకు వర్తించదు..

ఈ పేటీఎం యూపీఐ లైట్ ఫీచర్ కొన్ని ప్రధాన బ్యాంకులకు మాత్రమే పనిచేస్తుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా బ్యాంక్, పంజాబ్, నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లలో మాత్రమే ఈ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..