Google Search Tips: మీరు ఈ 3 విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే జైలుకే..
Google Search: ఏదైనా ప్రశ్నకు సమాధానం కావాలంటే గూగుల్ ఉండనే ఉంది. గూగుల్‌లో సెర్చ్ చేస్తే దానికి సంబంధించి సమాచారం వచ్చేస్తుంది. సెర్చ్ ఫీచర్ సహాయంతో అనేక ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవచ్చు. కానీ ప్రతి ప్రశ్నకు సమాధానం కోసం Googleని అడగడం కొన్నిసార్లు మీరు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కొన్ని పదాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏకంగా..
Google Search: ఏదైనా ప్రశ్నకు సమాధానం కావాలంటే గూగుల్ ఉండనే ఉంది. గూగుల్‌లో సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చేస్తుంది. సెర్చ్ ఫీచర్ సహాయంతో అనేక ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవచ్చు. కానీ ప్రతి ప్రశ్నకు సమాధానం కోసం Googleని అడగడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కొన్ని పదాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏకంగా జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది. ఐటీ నియమాలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, పబ్లిక్ డొమైన్‌లో శోధించడం నిషేధించబడిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంటర్నెట్‌లో శోధిస్తున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే అంశాలు ఏమిటో తెలుసుకుందాం.
పిల్లలకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్
పొరపాటున కూడా గూగుల్‌లో పిల్లలకు సంబంధించిన ఏదైనా అసభ్యకరమైన కంటెంట్‌ను వెతకడానికి ప్రయత్నించవద్దు. అలా చేయడం నేరం. ఇందు కోసం కఠినమైన చట్టం ఉంది. ఒక వ్యక్తి ఇలా చేస్తూ పట్టుబడితే ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఈ కేసులో ఆ వ్యక్తికి ఐదు నుండి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
బాంబులను తయారు చేయడంపై..
ఎవరైనా గూగుల్‌లో బాంబును ఎలా తయారు చేయాలో సెర్చ్ చేస్తే చిక్కుల్లో పడినట్లే. ఇలాంటి విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే భద్రతా ఏజెన్సీల రాడార్‌పైకి రావచ్చు. ఇలాంటి విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేయకపోవడం మంచిది. లేకుంటే ఇబ్బందుల్లో చిక్కుకుంటారు.
హ్యాకింగ్ పద్ధతి:
ఒక వ్యక్తి గూగుల్ సెర్చ్ సహాయంతో ఇంటర్నెట్‌లో హ్యాక్ చేయడానికి మార్గం కోసం వెతికితే, అది గూగుల్‌కు నచ్చదు. అలాంటి వ్యక్తికి కఠినమైన శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో జైలు శిక్ష పడవచ్చు. ఈ మూడు విషయాలు గూగుల్ లో సెర్చ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Mobile Network: మీ మొబైల్‌లో నెట్‌వర్క్ సరిగ్గా రావడం లేదా? ఇలా చేయండి!
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి