Moto G45 5G: రూ. 10వేలలోపే మోటో 5జీ ఫోన్.. తిరుగులేని ఫీచర్లు.. ఆఫర్ మిస్ కాకండి..
మోటోరోలా మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మోటో జీ45 5జీని ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ గా లాంచ్ చేసింది. దీనిలో డాల్బీ అట్మోస్, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్‌సెట్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ప్రధానాంశాలు. ఈ మోటో జీ45 5జీ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది.
మోటోరోలా బ్రాండ్ కి మన దేశంలో మంచి ఫ్యాన్ బేసే ఉంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు ఇది లాంచ్ చేస్తుండటం, వాటి పనితీరు మెరుగ్గా ఉండటంతో అందరూ మోటో ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. వీటిని వాడుతున్న వారి నుంచి కూడా పాజిటివ్ ఫీడ్ వస్తుండటంతో అందరూ హల్లో మోటో అంటున్నారు. ఈ క్రమంలో మోటోరోలా మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మోటో జీ45 5జీని ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ గా లాంచ్ చేసింది. దీనిలో డాల్బీ అట్మోస్, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్‌సెట్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ప్రధానాంశాలు. ఈ మోటో జీ45 5జీ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ మోటోరోలా కొత్త 5జీ ఫోన్ మార్కెట్లో ఇప్పటికే ఉన్న రియల్ మీ సీ63 5జీ, పోకో ఎం6 ప్రో, శామ్సంగ్ గెలాక్సీ ఎం14, లావా బ్లేజ్ 5జీ వంటి స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మోటో జీ 45 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మోటీ జీ45 5జీ ధర..
మోటీ జీ45 5జీ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయ్యింది. 4జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999, 8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఇది బ్రిలియంట్ బ్లూ, వివా మాగ్నెటా, బ్రిలియంట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయినప్పటికీ కొనుగోలు చేసేందుకు ఇంకా అందుబాటులోకి రాలేదు. మన దేశంలో ఆగస్టు 28న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ తో పాటు మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి. కొనుగోలుదారులు యాక్సిస్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో రూ. 1,000 తక్షణ తగ్గింపును కూడా పొందుతారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్‌లు రూ. 5,000 విలువైన ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. ఇందులో రూ. 2,000 క్యాష్‌బ్యాక్, రూ. 3,000 విలువైన వోచర్‌లు ఉంటాయి.
మోటీ జీ45 5జీ స్పెసిఫికేషన్స్
మోటీ జీ45 5జీ స్మార్ట్ ఫోన్లో 1600 X 720 పిక్సెల్ రిజల్యూషన్, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 లేయర్‌తో కూడిన 6.5-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూతో పాటు క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్3 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 15కి అప్‌గ్రేడ్ చేస్తామని, మూడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను కూడా అందిస్తామని కంపెనీ వాగ్దానం చేసింది. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది, ఇందులో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు వైపు 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్లో 20వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000ఎంఏహెచ్ బ్యాటరీని ఉంటుంది. ముఖ్యంగా, స్మార్ట్‌ఫోన్ బాక్స్‌లో బండిల్ చేయబడిన 18వాట్ల అడాప్టర్ ఉంటుంది. కనెక్టివిటీ కోసం, ఇది 5జీ, డ్యూయల్-బ్యాండ్ వైఫై బ్లూటూత్, జీపీఎస్ కి మద్దతుతో వస్తుంది. ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌ను కలిగి ఉంటుంది. మీరు భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్‌ను కూడా పొందుతారు. అదనంగా, స్మార్ట్ఫోన్ ఐపీ52 రేటింగ్, స్టీరియో స్పీకర్లతో వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..