Whatsapp: ఇక మీ ఫోన్ నంబర్‌ను ఎవరు చూడలేరు.. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్
వాట్సాప్.. ఈ యాప్ ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. అయితే యూజర్లను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. రానున్న రోజుల్లో మీ ఫోన్ నంబర్ ఎవ్వరికి కనిపించకుండా వాడే ఫీచర్ రాబోతోంది. వాట్సాప్‌లో తెలియని వ్యక్తులు..
వాట్సాప్.. ఈ యాప్ ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. అయితే యూజర్లను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. రానున్న రోజుల్లో మీ ఫోన్ నంబర్ ఎవ్వరికి కనిపించకుండా వాడే ఫీచర్ రాబోతోంది. వాట్సాప్‌లో తెలియని వ్యక్తులు ఎవరూ మీ ఫోన్ నంబర్‌ను చూడలేరు. ఫోన్ నంబర్ లేకుండానే వాట్సాప్ ఉపయోగించే ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు సంస్థ సిద్ధమవుతోంది. వాట్సాప్‌ని ఉపయోగించాలంటే తప్పనిసరిగా ఫోన్ నంబర్ ఉండాలి. అయితే చాలా సార్లు ఈ మొబైల్ నంబర్ తెలియని వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీని కారణంగా సైబర్ మోసాలు జరిగే ప్రమాదం ఉంది. వాట్సాప్ ఫోన్ నంబర్ లేకుండా వాట్సాప్‌ను ఉపయోగించుకునే కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.
మీ అనుమతి లేకుండా మీ వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను బహిర్గతం చేయకుండా మిమ్మల్ని రక్షించడానికి, Meta యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఒక ప్రత్యేక ఫీచర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో వాట్సాప్‌ను ఉపయోగించడానికి కంపెనీ ఒక ప్లాన్‌ను ప్రవేశపెట్టవచ్చు. తద్వారా వ్యక్తులు ఫోన్ నంబర్‌కు బదులుగా వినియోగదారు పేరును మాత్రమే చూడవచ్చు.
వాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్:
వాట్సాప్ ఫీచర్ ట్రాకింగ్ ప్లాట్‌ఫారమ్ WABetaInfo ప్రకారం.. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై పని చేస్తోంది. ఇది మీ వాట్సాప్ ఖాతా అదనపు భద్రత కోసం ప్రత్యేకమైన వినియోగదారు పేరును ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. పిన్ సపోర్ట్‌తో కూడా ఈ ఫీచర్‌ను విడుదల చేయవచ్చని నివేదిక పేర్కొంది.
📝 WhatsApp beta for Android 2.24.18.2: what’s new?
WhatsApp is working on an advanced username feature with PIN support, and it will be available in a future update!https://t.co/6P4feyVm6Y pic.twitter.com/a4tIr7Rwa3
— WABetaInfo (@WABetaInfo) August 19, 2024
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..