Google Photos: గూగుల్ ఫొటోస్ వెబ్ యూజర్లకు గుడ్ న్యూస్.. టాప్ లేపుతున్న కొత్త ఎడిటింగ్ టూల్స్.. పూర్తి వివరాలు ఇవి..
ఇటీవల కాలంలో గూగుల్ ఫొటోస్ ప్లాట్ ఫారంలో అనేక కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా రోబస్ట్ ఎడిటింగ్ టూల్స్, విడియో ఎఫెక్ట్స్, ఏఐ అసిస్టెట్ టూల్స్ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. వీటితో వినియోగదారులు తమ జ్ఞాపకాలను మరింత అందంగా పదిలంగా కాపాడుకోవచ్చు. ఇప్పుడు వెబ్ లోనే డైరెక్ట్ ఎడిట్ చేసుకొనేలా మరిన్ని ఎడిటింగ్ టూల్స్ ను ప్రవేశపెట్టింది.

గూగుల్ ఫొటోస్ యాప్ గురించి అందిరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి ఫోన్లో ఈ గూగుల్ ఫొటోస్ యాప్ ఉంటుంది. దానిలో ప్రత్యేకమైన ఎడిటింగ్ టూల్స్ కూడా ఉంటాయి. ఇటీవల కాలంలో గూగుల్ ఆ ప్లాట్ ఫారంలో అనేక కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా రోబస్ట్ ఎడిటింగ్ టూల్స్, విడియో ఎఫెక్ట్స్, ఏఐ అసిస్టెట్ టూల్స్ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. వీటితో వినియోగదారులు తమ జ్ఞాపకాలను మరింత అందంగా పదిలంగా కాపాడుకోవచ్చు. ఇప్పుడు వెబ్ లోనే డైరెక్ట్ ఎడిట్ చేసుకొనేలా మరిన్ని ఎడిటింగ్ టూల్స్ ను ప్రవేశపెట్టింది. వీటితో మీ పర్సనల్ కంప్యూటర్ లేదా మ్యాక్ లో గూగుల్ ఫొటోస్ వెబ్ సైట్ లోనే సులభంగా ఫొటోలను ఎడిట్ చేసుకొనే వెసులుబాటు కలిగింది. ఈ కొత్త ఎడిటింగ్ టూల్స్ ఏంటి? అవి ఎలా ఉపయోగపడతాయి? తెలుసుకుందాం రండి..
కొత్త ఎడిటింగ్ మెనూ..
గూగుల్ ఫొటోస్ లో ఓ కొత్త ఫొటోను మీరు ఓపెన్ చేయగానే గూగుల్ మిమ్మల్ని కొత్త ఎడిటర్ లోని తీసుకెళ్తుంది. దానిలో కొత్త ఎడిటింగ్ మెనూ మీకు కనిపిస్తుంది. రిఫ్రెష్ డ్ మెనూ దీనిలో ఉంటుంది. న్యూ సజెషన్స్ ట్యాబ్ మీ ఫొటోకు కొత్త రంగులు అద్దడానికి ఉపయగపడుతుంది. దీని కోసం నాలుగు ప్రీ సెట్ ఆప్షన్లు ఉంటాయి. ఇప్పటి వరకూ మూడు ఆప్షన్ మాత్రమే ఉండేవి. ఎన్ హ్యాన్స్, వార్న్, కూల్ అనే ఆప్షన్లు అందరికీ అందుబాటులో ఉంటాయి. డైనెమిక్ అనే కొత్త ఆప్షన్ మాత్రం గూగుల్ వన్ సబ్ స్క్రైబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇప్పుడు యాస్పెక్ట్ రేషియో ట్యాబ్ కూడా ప్రీ సెట్ రేషియోలను వినియోగదారులకు అందిస్తోంది. చిత్రాలను క్రాప్ చేసి, వివిధ ప్లాట్ ఫారాలలో వినియోగించుకునేందుకు వీలుగా దీనిని తీర్చిదిద్దింది. నెక్ట్స్ ట్యాబ్ లో మరిన్ని మార్పులు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. బ్రైట్ నెస్, కాంట్రాస్ట్, హైలైట్స్, శ్యాచురేషన్ వంటివి మార్పు చేసుకోవచ్చు. అలాగే చివరి ట్యాబ్ లో కలర్ ప్రోఫైల్స్ ఉటాయి. సులభంగా ఫొటోలకు వీటిని అప్లై చేసుకోవచ్చు. ప్రతి కలర్ ప్రొఫైల్ కూడా మన అవసరం మేరకు అడ్జస్ట్ చేసుకొనే వెసులుబాటును కల్పిస్తాయి.




ఎలా వినియోగించాలంటే..
మీరు ఒకవేళ ఈ కొత్త ఎడిటింగ్ టూల్స్ ని ప్రయత్నించాలనుకుంటే మీరు మీ పర్సనల్ కంప్యూటర్ లేదా మ్యాక్ లో గూగుల్ ఫొటోస్ వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా ఒక ఫొటోను మీరు ఎంపిక చేసుకుంటే అప్పుడు మీకు ఓ పాప్ అప్ మెసేజ్ కనిపిస్తుంది. న్యూటూల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటితో మీకు నచ్చిన విధంగా ఫొటోను ఎడిట్ చేసుకోవచ్చని సూచిస్తుంది. ఒకవేళ మీరు ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ఫొటోస్ యాప్ వినియోగిస్తున్నట్లు అయితే ఈ ఫీచర్లు మీకు ఏమి కొత్తగా అనిపించవు. యాప్ లో గత కొంత కాలంగా ఈ ఫీచర్లు అందుబాటులోనే ఉన్నాయి. కాగా ఇప్పుడు మాత్రం వెబ్ వెర్షన్ గూగుల్ ఫొటోస్ కు అత్యాధునిక ఎడిటింగ్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




