Google New Feature: గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మరో కొత్త ఫీచర్.. వికీపీడియా కన్నా మిన్నగా.. పూర్తి వివరాలు ఇవి..

ఏ సమాచారం తెలియక పోయినా గూగుల్ తల్లిని అడగండి అనే మాట చాలా మంది నోట వినే ఉంటారు. అంతలా జనాల్లో కలిసిపోయింది ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్. గూగుల్ వికిపీడియా సమాచారాన్ని తెలుసుకునేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్‌ను '800-పౌండ్ల గొరిల్లా' అని పిలిచారు. కాగా ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.

Google New Feature: గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మరో కొత్త ఫీచర్.. వికీపీడియా కన్నా మిన్నగా.. పూర్తి వివరాలు ఇవి..
Google Bard
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 19, 2023 | 5:24 PM

గూగుల్ సెర్చ్ ఇంజిన్.. ప్రపంచ సమాచారం తెలుసుకునేందుకు అందుబాటులోని, అందరూ ఎక్కువగా వినియోగించే ఏకైక సాధనం ఇది. కొన్ని దశాబ్దాలుగా దీని సేవలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. చిన్న కీ వర్డ్ సాయంతో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇట్టే చూపించేస్తుంది. ఏ సమాచారం తెలియక పోయినా గూగుల్ తల్లిని అడగండి అనే మాట చాలా మంది నోట వినే ఉంటారు. అంతలా జనాల్లో కలిసిపోయింది ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్. గూగుల్ వికిపీడియా సమాచారాన్ని తెలుసుకునేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా సెర్చ్ ఇంజిన్ మార్కెట్ విషయానికి వస్తే గూగుల్‌ను ‘800-పౌండ్ల గొరిల్లా’ అని పిలిచారు. కాగా ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

నోట్స్ పేరుతో ఫీచర్..

భారతదేశంతో పాటు యుఎస్‌లోని వినియోగదారులకు గూగుల్ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ను నోట్స్ అనే పేరుతో పరిచయం చేస్తోంది. ఈ ఫీచర్ సాయంతో మీరు గూగుల్లో వెతికిన అంశాలను చూసి.. వాటిపై కామెంట్ చేయొచ్చు. అంటే వికీపీడియాలో సమాచారాన్ని ఎడిట్ చేసినట్లు.. దీనిలో కూడా మీరు చూసిన సమాచారానికి కామెంట్లు చేయొచ్చన్నమాట. గూగుల్ ఈ కొత్త ఫీచర్ కు సంబంధించిన సమాచారాన్ని తన బ్లాక్ పోస్ట్ లో ప్రకటించింది. ఇది ఆప్ట్-ఇన్ ఫీచర్‌గా అందుబాటులో ఉంటుందని అందులో రాసింది.

ఎలా పనిచేస్తుందంటే..

ఒక నిర్దిష్ట అంశంపై వినియోగదారులు తమ అభిప్రాయాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి ఈ కొత్త ఫీచర్ అనుమతిస్తుంది. అదనపు సమాచారం ఉంటే దానిలో యాడ్ చేయొచ్చు. అప్పుడు ఇతరులు కూడా దాని నుంచి ప్రయోజనం పొందుతారు. ఈ కొత్త ఫీచర్ తో న్యూ లేయర్ ఆఫ్ హ్యూమన్ ఇన్ సైట్స్ ను వినియోగదారులు పొందగలరని గూగుల్ తన పోస్ట్ లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఎలా ఉపయోగించాలి..

మీరు గూగుల్ సెర్చ్ చేస్తున్నప్పుడు నోట్స్ కూడా రావాలంటే మీరు గూగుల్ యాప్ లోకి వెళ్లి ఈ నోట్స్ అనే ఫీచర్ ను ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది సెర్చ్ రిజల్ట్స్ కింద కనిపిస్తుంది.

నోట్ ని సృష్టించడం అనేది సరళమైన ప్రక్రియ, వినియోగదారులు వారి గమనికలను టెక్స్ట్, స్టిక్కర్లు , ఫోటోలతో అనుకూలీకరించడానికి వారి సహకారాన్ని వ్యక్తిగతీకరించడానికి వివిధ దృశ్య శైలులను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.

గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో భద్రతా సమస్యలను కూడా ప్రస్తావించింది. సెన్సిటివ్ టాపిక్స్ ఇది పనిచేయదని పేర్కొంది. రాబోయే నెలల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అందుబాటులోకి వస్తుందని గూగుల్ ప్రకటించింది. ఇది వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుందని పేర్కొంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?