సోషల్ మీడియాలో వచ్చే AI నకిలీ ఫొటోలను ఇట్టే గుర్తుపట్టేయొచ్చు.. ఎలా అంటే..?
గూగుల్ జెమినీ తాజాగా సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే నకిలీ ఏఐ ఫొటోలను ఈజీగా గుర్తుపట్టొచ్చు. నెట్టింట వైరల్ అయ్యే దాంట్లో ఏది నిజమనేది అర్ధం చేసుకోవడం కష్టం మారింది. దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ జెమినీ పరిష్కారం చూపుతుంది.

Google Gemini 3: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అందుబాటులోకి వచ్చాక ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేయడం సులువైంది. దీంతో సోషల్ మీడియాలో ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. నిజంగా జరిగిందనేలా ఏఐ టైల్స్ యూజ్ చేసి వీడియోలు, ఫొటోలు క్రియేట్ చేసి వదులుతున్నారు. కొంతమంది ఇవి నిజమేనని నమ్ముతున్నారు. దీంతో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోలేని పరిస్ధితుల్లో నెటిజన్లు ఉన్నారు. దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ తన ఏఐ ఫ్లాట్‌ఫామ్ జెమినీలో అద్బుతమైన ఫీచర్ తీసకొచ్చింది.దీని ద్వారా ఏఐ జనరేటెడ్ ఫొటోలను ఈజీగా గుర్తించవచ్చు.
ఇటీవల గూగుల్ జెమినీ 3 వెర్షన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఏఐ ఇమేజ్ డిటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. గూగుల్ అడ్వాన్స్‌డ్ డిజిటల్ వాటర్ మార్కరింగ్ టెక్నాలజీ ఆధారంగా దీనిని డెవలప్ చేశారు. ఇది ఏఐ టెక్నాలజీతో తయారుచేసిన ప్రతీ ఫొటోలో అదృశ్య వాటర్ మార్క్‌ను పొందుపరుస్తుంది. ఈ వాటర్ మార్క్ కంటికి కనిపించదు.. కానీ జెమినీ ఏఐ టూల్ దానిని స్కాన్ చేసి కనిపెట్టగలదు. అయితే గూగుల్ ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఫొటోలను మాత్రమే ఇది ప్రస్తుతం గుర్తిస్తుంది. ఇతర ఏఐ టూల్స్ ద్వారా క్రియేట్ చేసిన ఫొటోలను గుర్తించలేదు.
ఎలా చెక్ చేయాలంటే..?
-జెమినీ యాప్‌లోకి ఫొటోను అప్‌లోడ్ చేయండి
-ఇది గూగుల్ ఏఐ ద్వారా క్రియేట్ చేశారా.. లేదా ఇతర టూల్స్ ద్వారా అనేది టైప్ చేయండి
-వెంటనే జెమినీ ఏఐ ఫొటోను స్కాన్ చేసి వాటర్ మార్క్ ద్వారా ఫొటో నిజమా.. లేదా ఏఐ ద్వారా క్రియేట్ చేశారా అనేది చెబుతుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




