Apple Offers: విద్యార్థులకు యాపిల్ శుభవార్త.. ఫ్రీగా ఎయిర్ ప్యాడ్స్! పలు గ్యాడ్జెట్లపై అదిరే ఆఫర్లు..
మన దేశంలోని విద్యార్థులకు అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ శుభవార్త చెప్పింది. యాపిల్ గ్యాడ్జెట్ల కొనుగోలుపై ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించింది. అందుకోసం బ్యాక్ టు యూనివర్సిటీ 2023 పేరుతో ప్రత్యేక సేల్ ను ప్రారంభించింది.
మన దేశంలోని విద్యార్థులకు అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ శుభవార్త చెప్పింది. యాపిల్ గ్యాడ్జెట్ల కొనుగోలుపై ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించింది. అందుకోసం బ్యాక్ టు యూనివర్సిటీ 2023 పేరుతో ప్రత్యేక సేల్ ను ప్రారంభించింది. దీనిలో ఐ ప్యాడ్, మ్యాక్ బుక్స్, డెస్క్ టాప్ కంప్యూటర్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ జూన్ 22న ప్రారంభం అయ్యింది. అక్టోబర్ 2 వరకూ కొనసాగనుంది. అసలు ఈ సేల్ ఏంటి? దీనిలో ఏమేమి ఆఫర్లు ఉన్నాయి? తెలుసుకుందాం రండి..
బ్యాక్ టు యూనివర్సిటీ సేల్ ఇది..
విద్యార్థులతో పాటు అధ్యాపకులు, ఆయా కళాశాలల్లో పనిచేసే స్టాఫ్ కూడా కూడా బ్యాక్ టు యూనివర్సిటి ఆఫర్ కింద ఐప్యాడ్, మ్యాక్‌బుక్‌లు కొనుగోలు చేసుకోవచ్చని యాపిల్ తెలిపింది. ఈ ఆఫర్‌ను పొందేందుకు సరైన కళాశాల గుర్తింపు కార్డు ఉండాలని స్పష్టం చేసింది. యాపిల్ బీకేసీ, యాపిల్ సాకెట్, యాపిల్ ఆన్ లైన్ స్టోర్లలో ఈ సేల్ అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన మ్యాక్‌బుక్‌లతో ఎయిర్‌పాడ్స్, ఐప్యాడ్‌లతో యాపిల్ పెన్సిల్ ఉచితంగా అందిస్తామని పేర్కొంది. ఆపిల్‌కేర్ ప్లస్ సర్వీసులపై 20 శాతం తగ్గింపును పొందవచ్చు.
వీటిపై ఆఫర్లు..
- యాపిల్ వెబ్ సెట్ ప్రకారం 11 అంగుళాల ఐప్యాడ్ ప్రో ను కేవలం రూ.76,900లకే పొందవచ్చు. దీని అసలు ధర రూ. 96,900గా ఉంది. అలాగే 12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రోను ప్రత్యేక ఆఫర్ కింద రూ.1,02,900కు, ఐప్యాడ్, ఐప్యాడ్ ఎయిర్ లను రూ.54,000కే అందుబాటులో ఉన్నాయి. ఈ ఐప్యాడ్ మోడళ్లపై యాపిల్ పెన్సిల్ ఉచితంగా రానున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాపిల్ కోరింది.
- 13 అంగుళాల యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ 13 ఎం1 అసలు ధర రూ.99,900గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ. 89,900 కొనుగోలు చేయవచ్చు. ధర రూ.1,14,900గా ఉన్న ఎయిర్ 13 ఎం2ను కేవలం రూ.1,04,900కే కొనుగోలు చేయొచ్చు. ఇటీవల లాంచ్ అయిన 15 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ 15 ఎం2 అసలు ధర రూ.1,34,900 కాగా కేవలం ధర రూ.1,24,900కే కొనుగోలు చేయవచ్చు.
- మ్యాక్‌బుక్ ప్రో, 13 అంగుళాల మ్యాక్‌బుక్, 14 అంగుళాల, 16 అంగుళాల మోడళ్ల ప్రారంభ ధర రూ. 1,19,900, రూ.1,84,900, రూ.2,29,900గా ఉంది. బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫర్ కింద ఈ మోడళ్ల మ్యాక్‌బుక్‌లను కేవలం ప్రారంభ ధర రూ. 1,29,900, రూ. 1,99,900, రూ.2,49,900కే కొనుగోలు చేయవచ్చు.
- యాపిల్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫర్ కింద కేవలం మ్యాక్‌బుక్‌లే కాకుండా.. ఐమ్యాక్‌ను ధర రూ.1,24,900కే కొనుగోలు చేయవచ్చు. మ్యాక్ మినీపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. కేవలం ధర రూ. 49,900కే కొనుగోలు చేయవచ్చు. అయితే మ్యాక్ స్టూడియో, కొత్తగా విడుదలైన మ్యాక్‌ప్రో ఎం2పై ఎటువంటి ఆఫర్‌లు అందుబాటులో లేవు.
- ఐప్యాడ్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో 11, ఐప్యాడ్ ప్రో 12.9లను వరుసగా రూ.54,000, రూ.76,900, రూ.1,02,900కే అందుబాటులో ఉన్నాయి. ఈ ఐప్యాడ్ మోడళ్లపై యాపిల్ పెన్సిల్ ఉచితంగా రానున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాపిల్ కోరింది.
- అదనంగా యాపిల్‌కేర్ ప్లస్ సర్వీసులపై 20 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్‌లు ఆపిల్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. యాపిల్ రీసెల్లర్ వద్ద కూడా ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. వారి వద్ద అదనంగా డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్ పొందవచ్చని సూచించింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..