Apple Days Sale: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రత్యేక సేల్ ద్వారా ఆ ఫోన్లపై అదిరిపోయే తగ్గింపులు
భారతదేశంలో ఉన్న మధ్యతరగతి వారికి కూడా ఐఫోన్లను అందుబాటులో ఉంచాలని వివిధ సేల్స్ ద్వారా యాపిల్ తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను అందిస్తుంది. ముఖ్యంగా యాపిల్ డేస్ సేల్ పేరుతో వివిధ టాప్ కంపెనీల భాగస్వామ్యంతో మరింత తక్కువ ధరకే యాపిల్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా యాపిల్ డేస్ సేల్ జూన్ 8 నుంచి విజయ్ సేల్స్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్ జూన్ 17 వరకు కొనసాగుతుంది.

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా పెరుగుతున్న టెక్నాలజీకు అనుగుణంగా వివిధ కంపెనీలకు సంబంధించిన ఫోన్లను యువత అధికంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఫోన్లపై ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు. కానీ ఈ యాపిల్ ఫోన్ల ధర కాస్త ఎక్కువగా ఉండడంతో సగటు మధ్యతరగతి ప్రజలు ఈ ఫోన్లను కొనేందుకు ముందుకు రావడం లేదు. అయితే భారతదేశంలో ఉన్న మధ్యతరగతి వారికి కూడా ఐఫోన్లను అందుబాటులో ఉంచాలని వివిధ సేల్స్ ద్వారా యాపిల్ తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను అందిస్తుంది. ముఖ్యంగా యాపిల్ డేస్ సేల్ పేరుతో వివిధ టాప్ కంపెనీల భాగస్వామ్యంతో మరింత తక్కువ ధరకే యాపిల్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా యాపిల్ డేస్ సేల్ జూన్ 8 నుంచి విజయ్ సేల్స్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్ జూన్ 17 వరకు కొనసాగుతుంది. ఈ 10-రోజుల ఈవెంట్ యాపిల్ ఉత్పత్తులపై వివిధ రకాల ఆకర్షణీయమైన డీల్‌లను అందిస్తుంది, మొత్తం 140 విజయ్ సేల్స్ రిటైల్ అవుట్‌లెట్‌లలో మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయ్ సేల్స్‌లో యాపిల్ డేస్ సేల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఐఫోన్ 15 ప్రో డీల్స్ ఇలా
- ఐఫోన్ 15 ప్రో 1 టీబీ వెర్షన్ అసలు ధర రూ. 184,900గా ఉంటే ఇప్పుడు రూ. 163,490కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లకు రూ. 3,000 తక్షణ తగ్గింపుతో తుది ధర రూ.160,490కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలు చేయడం ద్వారా 1226 లాయల్టీ పాయింట్‌లను పొందవచ్చు.
- ఐ ఫోన్ 15 ప్రో 512 జీబీ సాధారణంగా ధర రూ. 164,900 ఉండగా తాజా సేల్‌లో రూ. 154,990కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లకు రూ. 3,000 తక్షణ తగ్గింపుతో ఈ ఫోన్‌ను రూ. 151,990కే కొనుగోలు చేయవచ్చు. అలాగే కస్టమర్లు 1162 లాయల్టీ పాయింట్లను కూడా అందుకుంటారు.
- ఐ ఫోన్ 15 ప్రో 256 జీబీ సాధారణంగా ధర రూ.1,44,900 ఉండగా తాజా సేల్‌లో రూ. 1,35,990కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లకు రూ. 3,000 తక్షణ తగ్గింపుతో ఈ ఫోన్‌ను రూ. 1,32,990కే కొనుగోలు చేయవచ్చు. అలాగే కస్టమర్లు 1020 లాయల్టీ పాయింట్లను కూడా పొందవచ్చు.
- ఐ ఫోన్ 15 ప్రో 128 జీబీ సాధారణంగా రూ. 1,34,900 ఉండగా తాజా సేల్‌లో రూ. 1,26,990కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లకు రూ. 3,000 తక్షణ తగ్గింపుతో ఈ ఫోన్‌ను రూ. 1,23,990కే కొనుగోలు చేయవచ్చు. అలాగే కస్టమర్లు 952 లాయల్టీ పాయింట్లను కూడా అందుకుంటారు.
ఐ ఫోన్ 15 ప్రో మ్యాక్స్ డీల్స్
- ఐ ఫోన్ 15 ప్రో మ్యాక్స్ 1 టీబీ వేరియంట్ ధర సాధారణంగా రూ.1,99,900గా ఉంటే ఈ తాజా సేల్‌లో కేవలం రూ.1,77,990కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లకు రూ. 3,000 తక్షణ తగ్గింపుతో తుది ధర రూ.1,74,990కు కొనుగోలు చేయవచ్చు. అదనంగా కొనుగోలుదారులు 1335 లాయల్టీ పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది.
- ఐ ఫోన్ 15 ప్రో మ్యాక్స్ 512 జీబీ వేరియంట్ ధర సాధారణంగా రూ.1,79,900గా ఉంటే ఈ తాజా సేల్‌లో కేవలం రూ.1,67,990కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లకు రూ. 3,000 తక్షణ తగ్గింపుతో తుది ధర రూ.1,64,990కు కొనుగోలు చేయవచ్చు. అదనంగా కొనుగోలుదారులు 1260 లాయల్టీ పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది.
- ఐ ఫోన్ 15 ప్రో మ్యాక్స్ 256 జీబీ వేరియంట్ ధర సాధారణంగా రూ.1,59,900గా ఉంటే ఈ తాజా సేల్‌లో కేవలం రూ.1,48,990కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లకు రూ. 3,000 తక్షణ తగ్గింపుతో తుది ధర రూ.1,45,990కు కొనుగోలు చేయవచ్చు. అదనంగా కొనుగోలుదారులు 1117 లాయల్టీ పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది.
ఇతర యాపిల్ ఉత్పత్తులపై ఆఫర్స్ ఇలా
విజయ్ సేల్స్ మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌లపై కూడా అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. అలాగే యాపిల్ వాచ్‌లు, ఎయిర్ పాడ్‌లపై డిస్కౌంట్‌లతో మీ యాక్సెసరీలను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. డిస్కౌంట్‌తో లభించే హోమ్‌పాడ్ మినీతో మీ స్మార్ట్ హోమ్ అనుభవాన్ని మెరుగుపరచుకునే అవకాశం ఉంది. అలాగే విక్రయ ఆఫర్‌లలో భాగంగా యాపిల్ కేర్ ప్లస్ మీ పరికరాలను రక్షించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లు తమ కొనుగోళ్లపై రూ. 10,000 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఇంకా ఇన్-స్టోర్ షాపర్లు క్యాషిఫై అందించిన రూ. 12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ నుండి ప్రయోజనం పొందవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..