5G Under 10K: రూ. 10వేల లోపు ధరలో 5జీ ఫోన్స్ ఇవే.. వాటిల్లో బెస్ట్ ఏది అంటే..
తక్కువ ధరలో లభించే ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో రూ. 10వేల లోపు ఏ ఫోన్లు బెస్ట్ అని చూస్తే.. ఓ రెండు బ్రాండ్లు రూ. 10వేల లోనే 5జీ వేరియంట్లను తీసుకొచ్చాయి. ఇప్పుడంతా 5జీ నే కదా. అందుకే తక్కువ ధరలో లభించే 5జీ ఫోన్లను ఇటీవల రెండు కంపెనీలు లాంచ్ చేశాయి. అవి లావా యువ 5జీ, పోకో ఎం6 5జీ. ఈ రెండు ఫోన్లకు సంబంధించిన పూర్తి పోలికలను ఇప్పుడు మీకు అందిస్తున్నాం.
మార్కెట్లో ఎన్ని రకాల స్మార్ట్ ఫోన్లు ఉన్నా.. ఎన్ని ప్రీమియం ఫోన్లు లభిస్తున్నా.. అన్నింటికీ దానికి తగిన వినియోగదారు ఉంటాడు. సాధారణంగా లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రీమియం మోడల్ ఫోన్లకూ డిమాండ్ ఉన్నా.. వాటి ధరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు వాటిని కొనుగోలు చేయలేరు. ఈ క్రమంలో తక్కువ ధరలో లభించే ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో రూ. 10వేల లోపు ఏ ఫోన్లు బెస్ట్ అని చూస్తే.. ఓ రెండు బ్రాండ్లు రూ. 10వేల లోనే 5జీ వేరియంట్లను తీసుకొచ్చాయి. ఇప్పుడంతా 5జీ నే కదా. అందుకే తక్కువ ధరలో లభించే 5జీ ఫోన్లను ఇటీవల రెండు కంపెనీలు లాంచ్ చేశాయి. అవి లావా యువ 5జీ, పోకో ఎం6 5జీ. ఈ రెండు ఫోన్లకు సంబంధించిన పూర్తి పోలికలను ఇప్పుడు మీకు అందిస్తున్నాం. వాటి పనితీరు, బ్యాటరీ లైఫ్, ఫీచర్ల గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
లావా యువ 5జీ వర్సెస్ పోకో ఎం6 5జీ..
డిస్‌ప్లే.. లావా యువ 5జీ ఫోన్లో 6.52 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే, హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అదే సమయంలో పోకో ఎం6 5జీ ఫోన్లో 6.74 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే 90హెర్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. పోకో ఫోన్ కూడా హెచ్డీ రిజల్యూషన్ కు సపోర్టు ఇస్తుంది.
కెమెరా.. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే లావా యువ 5జీ ఫోన్లో డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది. 50ఎంపీ కెమెరా, 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ సెకండరీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. మరో వైపు పోకో ఎం6 5జీ స్మార్ట్ ఫోన్లో 50ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా ఉంటుంది. ముందు వైపు సెల్పీల కోసం 5ఎంపీ కెమెరా ఇచ్చారు.
పనితీరు.. ప్రతి రోజు సక్రమమైన పనితీరు కోసం యూనీసోక్ టీ750 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మాలీ జీ57 జీపీయూకు అనుసంధానించబడి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. మరోవైపు పోకో ఎం6 ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. మాలి జీ57 జీపీయూ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది.
సాఫ్ట్ వేర్.. లావా యువ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. పోకో ఎం6 కూడా ఆండ్రాయిడ్ 13 ఆధారంగానే పనిచేస్తుంది.
బ్యాటరీ.. లావా యువ 5జీ, పోకో ఎం6 రెండూ కూడా 5000ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్టుతో వస్తాయి. రెండింట్లోనూ 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. పోకో ఎం6 ఫోన్ బాక్స్ లో 10వాట్ల అడాప్టర్ ఉంటుంది.
ధర.. లావా యువ 5జీ ధర రూ. 9499గా ఉంటుంది. అదే సమయంలో పోకో ఎం6 ప్రారంభ ధర రూ. 10,499గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..