AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gmail: అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చిన గూగుల్‌! ఇక దాన్ని ఈజీగా మార్చుకోవచ్చు..

గూగుల్‌ తన జీమెయిల్‌లో కీలక అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై యూజర్లు కొత్త ఖాతా సృష్టించకుండానే తమ ప్రస్తుత ఈమెయిల్ ఐడీని నేరుగా మార్చుకోవచ్చు. దీనివల్ల డేటా నష్టం ఉండదు, పాత మెయిల్స్ కూడా యథాతథంగా ఉంటాయి. పాత, కొత్త చిరునామాలకు పంపిన అన్ని మెయిల్స్ ఒకే ఇన్‌బాక్స్‌లోకి చేరుతాయి.

Gmail: అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చిన గూగుల్‌! ఇక దాన్ని ఈజీగా మార్చుకోవచ్చు..
Google
SN Pasha
|

Updated on: Apr 02, 2026 | 5:47 AM

Share

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వినియోగదారులు ఉపయోగించే గూగుల్‌ తన ఈమెయిల్ సేవ జీమెయిల్‌లో కీలకమైన కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు కొత్త ఖాతా సృష్టించకుండా, తమ ప్రస్తుత జీమెయిల్‌ చిరునామాను నేరుగా మార్చుకునే అవకాశం పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈమెయిల్ ఐడీ మార్చాలంటే కొత్త ఖాతా సృష్టించి, పాత మెయిల్స్, కాంటాక్ట్‌లు, డేటాను మాన్యువల్‌గా బదిలీ చేయాల్సి వచ్చేది. అయితే కొత్త ఫీచర్‌తో ఈ ప్రక్రియ చాలా సులభంగా మారనుంది. సుందర్‌ పిచ్చాయ్‌ ధృవీకరించిన ఈ మార్పు, ముఖ్యంగా పాత లేదా అనవసరంగా కనిపించే ఈమెయిల్ ఐడీలను మార్చుకోవాలనుకునే వారికి ఉపయోగపడుతుంది.

యూజర్లు గూగుల్‌ అకౌంట్‌ సెట్టింగ్‌లలోకి వెళ్లి అందుబాటులో ఉన్న కొత్త జీమెయిల్‌ చిరునామాను ఎంచుకుని మార్పులు చేయవచ్చు. ముఖ్యంగా ఈ మార్పు సమయంలో ఎలాంటి డేటా నష్టం ఉండదు. ఈమెయిళ్లు, కాంటాక్ట్‌లు, ఖాతా వివరాలు అన్నీ యథాతథంగా కొనసాగుతాయి. పాత జీమెయిల్‌ చిరునామా కూడా పూర్తిగా తొలగించబడదు. అది ఖాతాకు అనుసంధానించబడి ఉండటంతో, మరెవ్వరూ దానిని ఉపయోగించలేరు. అంతేకాకుండా పాత లేదా కొత్త చిరునామాకు పంపిన అన్ని మెయిల్స్ కూడా అదే ఇన్‌బాక్స్‌లోకి చేరుతాయి. దీంతో యూజర్లు ఎలాంటి సందేశాలను కోల్పోకుండా మార్పు చేసుకోవచ్చు.

ఇక ఈ అప్‌డేట్‌తో పాటు గూగుల్‌, AI ఆధారిత కొత్త ఇన్‌బాక్స్ ఫీచర్లను కూడా తీసుకువస్తోంది. ఇందులో జెమినీ ఆధారంగా పనిచేసే AI ఇన్‌బాక్స్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ముఖ్యమైన మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా గుర్తించబడి, బిల్లులు లేదా గడువు తేదీలు వంటి అంశాలు సూచించిన పనులుగా చూపబడతాయి. అలాగే ప్రయాణ బుకింగ్‌లు లేదా రిజర్వేషన్‌ల వంటి సమాచారాన్ని ఒకేచోట సమీకరించే టాపిక్స్ టు క్యాచ్ అప్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు పరిమిత వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. మొత్తం మీద, ఈ మార్పులు జీమెయిల్‌ వినియోగాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, వ్యక్తిగత డిజిటల్ నిర్వహణలో కొత్త స్థాయిని తీసుకురానున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us