AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిపోయే ఫీచర్‌ తెస్తున్న వాట్సాప్‌..! ఇక ఆ మెసేజ్‌లు కూడా చదవొచ్చు!

వాట్సాప్ యూజర్ల సమయాన్ని ఆదా చేసేందుకు 'అన్‌రీడ్ చాట్ సమ్మరీ' అనే కొత్త ఫీచర్‌ను తెస్తోంది. ఇది చదవని మెసేజ్‌ల సారాంశాన్ని ఒకేసారి చూపిస్తుంది, ప్రతి చాట్ తెరవాల్సిన అవసరం లేకుండా. ప్రైవేట్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో సందేశాల గోప్యతకు భద్రత ఇస్తుంది.

అదిరిపోయే ఫీచర్‌ తెస్తున్న వాట్సాప్‌..! ఇక ఆ మెసేజ్‌లు కూడా చదవొచ్చు!
Whatsapp 3
SN Pasha
|

Updated on: Mar 31, 2026 | 6:53 PM

Share

యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ను ఎప్పటికప్పుడు మెరుగుపరచడానికి కొత్త ఫీచర్లను నిరంతరం ప్రవేశపెడుతున్న వాట్సాప్‌, ఇప్పుడు మెసేజ్‌లను చదివే విధానాన్ని పూర్తిగా మార్చే ప్రయత్నంలో ఉంది. రోజువారీ పనుల బిజీలో చాలా మంది తమ చాట్‌లను, ముఖ్యంగా గ్రూప్ సంభాషణలను, సకాలంలో చూడలేకపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా “అన్‌రీడ్‌ చాట్‌ సమ్మరీ” అనే వినూత్న ఫీచర్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు చదవని మెసేజ్‌ల సారాంశాన్ని ఒకేసారి చూసే వీలుంటుంది. దీని వల్ల ప్రతి చాట్‌ను విడిగా తెరిచి చదవాల్సిన అవసరం తగ్గుతుంది.

ఈ ఫీచర్ ప్రత్యేకత దాని భద్రతా విధానంలో ఉంది. మెటా ప్లాట్‌ఫామ్స్‌ అభివృద్ధి చేస్తున్న ప్రైవేట్ ప్రాసెసింగ్ సాంకేతికత ద్వారా, యూజర్‌ కోరినప్పుడు మాత్రమే చదవని కొత్త సందేశాలను ప్రాసెస్ చేసి వాటి సారాంశాన్ని రూపొందిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా సురక్షిత వాతావరణంలో జరుగుతుందని, మెసేజ్‌ల అసలు కంటెంట్‌ను కంపెనీ కూడా యాక్సెస్ చేయలేదని స్పష్టం చేసింది. దీంతో ఇతర AI ఆధారిత సేవలతో పోలిస్తే ఈ ఫీచర్ మరింత గోప్యతను కాపాడుతుందని భావిస్తున్నారు.

ముఖ్యంగా ఈ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్‌గా ఉండనుంది. యూజర్లు తమకు అవసరమైన చాట్‌లకే సారాంశాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ ప్రాసెసింగ్ ఆప్షన్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉండి, అవసరమైతే సెట్టింగ్స్ ద్వారా ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో పరీక్షించబడుతోంది. అన్ని పరీక్షలు పూర్తయ్యాక, దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, ఎక్కువ మెసేజ్‌లు వచ్చే వినియోగదారులకు సమయాన్ని ఆదా చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us