Gizmore Smart Watch: మార్కెట్‌లోకి నయా స్మార్ట్ వాచ్.. స్టైల్ డిజైన్ చూశారంటే అదిరిపోతారంతే..

జిగ్‌మోర్‌ కంపెనీకు చెందిన జిగ్ ఫిట్ స్మార్ట్‌వాచ్ శ్రేణి భారతదేశంలో మరో కొత్త స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. జిగ్‌ఫిట్ గ్లో జెడ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ అందరూ కొనుగోలు చేసే శ్రేణిలోనే కేవలం రూ.2 వేల లోపు ధరతో వస్తుంది. ముఖ్యంగా ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే అధునాతన ఫీచర్లు ఈ వాచ్‌లో అనేకం ఉన్నాయి.

Gizmore Smart Watch: మార్కెట్‌లోకి నయా స్మార్ట్ వాచ్.. స్టైల్ డిజైన్ చూశారంటే అదిరిపోతారంతే..
Gizmore
Follow us

|

Updated on: May 23, 2023 | 5:15 PM

భారతదేశంలో స్మార్ట్ వాచ్ వాడకం పెరిగేసరికి అదే స్థాయిలో స్మార్ట్ యాక్ససరీస్‌ల వాడకం కూడా పెరగుతుంది. ఈ స్మార్ట్ యాక్ససరీస్‌లో ముఖ్యంగా బ్లూటూత్ ఇయర్ బడ్స్‌తో పాటు స్మార్ట్ వాచ్‌ల వాడకం అధికంగా ఉంది. దీంతో పెరిగిన మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని కంపెనీలు కూడా సూపర్ స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా డిజైన్‌తో పాటు అధునాతన ఫీచర్లతో ఈ వాచ్‌లు యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం వాచ్‌ల తయారీతోనే మార్కెట్‌లోకి వచ్చిన కొన్ని కంపెనీలు తమ మార్క్‌ను చూపుతున్నాయి. జిగ్‌మోర్‌ కంపెనీకు చెందిన జిగ్ ఫిట్ స్మార్ట్‌వాచ్ శ్రేణి భారతదేశంలో మరో కొత్త స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. జిగ్‌ఫిట్ గ్లో జెడ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ అందరూ కొనుగోలు చేసే శ్రేణిలోనే కేవలం రూ.2 వేల లోపు ధరతో వస్తుంది. ముఖ్యంగా ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే అధునాతన ఫీచర్లు ఈ వాచ్‌లో అనేకం ఉన్నాయి. ఈ వాచ్ ధర రూ. 1,999గా కంపెనీ నిర్ణయించింది. కానీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 1,499కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం మొదటి మూడు రోజులు మాత్రమే ఉంటుంది. అలాగే జిగ్ మోర్ వెబ్‌సైట్‌లో ఈ వాచ్ రూ.1799కు అందుబాటులో ఉంది. అలాగే బ్లాక్, బ్లూ, మెరూన్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్‌కు చెందిన ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

జిగ్ ఫిట్ గ్లో జెడ్ మెటల్ బాడీతో 1.78 అంగుళాల డిస్‌ప్లే 2.5డీ కర్వ్డ్ ఎమోఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది. అలాగే హెచ్‌డీ రిజల్యూషన్, 600 నిట్స్ బ్రైట్‌నెస్‌ ఈ వాచ్ ప్రత్యేకతలు. అలాగే ఇది ఆల్వేస్-ఆన్-డిస్ప్లే (ఏఓడీ) ఫంక్షనాలిటీతో పాటు అనేక క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్ ఎంపికలతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. కాబట్టి ఈ వాచ్‌లో అంతర్నిర్మిత మైక్, స్పీకర్ ఉంది. డయల్ ప్యాడ్, లాగ్‌లు, ఇష్టమైన పరిచయాలను యాక్సెస్ చేయడానికి ప్రత్యేక ఎంపికలు ఉంటాయి. అలాగే ఇందులో వచ్చే పవర్ ఫుల్ బ్యాటరీ ద్వారా ఓ చార్జ్‌పై 15 రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఒకవేళ బ్లూట్ కాలింగ్‌ను ఎనేబుల్ చేసుకుంటే మాత్రం మూడు రోజుల ఉంటుంది. అలాగే ఆరోగ్య పర్యవేక్షణ కోసం మీరు 24×7 హార్ట్ బీట్ సెన్సార్, ఎస్‌పీ ఓ2 సెన్సార్, పీరియడ్ ట్రాకర్, స్లీప్ ట్రాకర్‌తో ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది. ఈ వాచ్‌లో 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉంటాయి. అలాగే ఫిట్ క్లౌడ్ ప్రో యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. దీంతో పాటు స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ కూడా ఉంది. ఇది సెట్టింగ్‌లు, యాప్‌లతో పాటు ఇతర సౌకర్యాలను పక్కపక్కనే యాక్సెస్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. హోమ్ స్క్రీన్‌పై కుడివైపునకు స్వైప్ చేయడం ద్వారా దీన్ని ఈ వాచ్‌ను ప్రారంభించవచ్చు. మనం ఉపయోగిస్తున్న ఫోన్‌ని బట్టి గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి ఏఐకు కూడా మద్దతు ఇస్తుంది. ఐపీ 67 రేటింగ్‌తో వచ్చే ఈ వాచ్ ద్వారా రిమైండర్‌లు, వాతావరణ అప్‌డేట్‌లు, గైడెడ్ బ్రీతింగ్ ప్రాక్టీస్ వంటి ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..