Redmi A2: రెడ్‌మీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. బడ్జెట్ ఫోన్స్ రంగానికి ఊతమిస్తూ మరో కొత్త సిరీస్ ప్రకటన.. ఏకంగా రెండేళ్ల వారెంటీ…
మొదటి నుంచి బడ్జెట్ ఫోన్స్ రంగంలో ప్రత్యేక దృష్టి ఎంఐ కంపెనీ రిలీజ్ చేస్తే రెడ్‌మీ ఫోన్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇటీవల రెడ్‌మీ ఫోన్స్ ప్రజలకు ఆకట్టుకోవడం లేదు. దీంతో ఇప్పుడు రెడ్‌మీ మంచి ప్రాసెసర్‌తో అతి తక్కువ ధరకు అధిక ఫీచర్లు ఉన్న ఫోన్లను రిలీజ్ చేసింది. రెడ్‌మీ ఏ2, ఏ2 ప్లస్ ఫోన్లను మార్కెట్‌లో లాంచ్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. గతంలో కేవలం ఫోన్స్, మెసేజ్‌లకు మాత్రమే పరిమితమైన ఫోన్స్ మరింత స్మార్ట్‌గా తయారై అన్ని అవసరాలకు ఫోన్ కావాలనే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ తర్వాత భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు ఫోన్లు కావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అన్ని ఫీచర్లతో వచ్చే స్మార్ట్ ఫోన్లు కావాలంటే రూ.20,000 మించి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మధ్య తరగతి ప్రజలు ఆ మాత్రం వెచ్చించకలేక ఇబ్బందిపడుతున్నారు. మొదటి నుంచి బడ్జెట్ ఫోన్స్ రంగంలో ప్రత్యేక దృష్టి ఎంఐ కంపెనీ రిలీజ్ చేస్తే రెడ్‌మీ ఫోన్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇటీవల రెడ్‌మీ ఫోన్స్ ప్రజలకు ఆకట్టుకోవడం లేదు. దీంతో ఇప్పుడు రెడ్‌మీ మంచి ప్రాసెసర్‌తో అతి తక్కువ ధరకు అధిక ఫీచర్లు ఉన్న ఫోన్లను రిలీజ్ చేసింది. రెడ్‌మీ ఏ2, ఏ2 ప్లస్ ఫోన్లను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఐరోపాలో ఈ ఫోన్లను లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్లు భారత మార్కెట్‌లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఫోన్ల ధర, ఇతర ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
ఈ రెడ్‌మీ ఏ2 సిరీస్‌లో అనే ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు అందుబాటులో ఉన్నాయి. 2 జీబీ+ 32 జీబీ వేరియంట్ ధర రూ.5,999గా ఉంది. అలాగే 2 జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.6499గా కంపెనీ నిర్ణయించింది. 4జీబీ+64 జీబీ ఫోన్ ధరను కంపెనీ రూ.7499గా నిర్ణయించింది. అలాగే ఏ2 ప్లస్ ఫోన్ 4 జీబీ+64 జీబీ వేరియంట్ ఫోన్ రూ.8499కు అందుబాటులో ఉంది. అలాగే ఈ రెండు ఫోన్లకు కంపెనీ రెండు సంవత్సరాల వారెంటీ పీరియడ్‌ను అందిస్తుంది. ఈ రెండు ఫోన్లకు రెడ్‌మీ కంపెనీ రెండు సంవత్సరాల వారెంటీని అందిస్తుంది.
6.52 అంగుళాల అతిపెద్ద ఎల్‌సీడీ 1600×720 పిక్సెల్స్ హెచ్‌డీ ప్లస్ రిజుల్యూషన్ స్క్రీన్, ఫ్రంట్ కెమెరా డిస్‌ప్లేతో వాటర్ డ్రాప్ నాచ్‌తో వస్తుంది. ముఖ్యంగా ఈ స్క్రీన్ చాలా సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంది. సీ గ్రీన్, ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు స్ప్లాష్-, స్క్రాచ్-రెసిస్టెంట్ బాడీని కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లల్లో డ్యూయల్ సిమ్ కార్డ్‌ల సదుపాయం ఉంది. అలాగే మైక్రో ఎస్‌డీ కోసం ప్రత్యేకంగా స్లాట్‌ను అందింాచరు. అలాగే మీడియా టెక్ హీలియో జీ 36 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌లో వెనుకవైపు డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే 8 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ల ప్రత్యేకతలు. అలాగే 10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 13 సపోర్ట్‌తో పాటు 3 జీబీ వర్చువల్ ర్యామ్ ఫెసిలిటీను అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..