Redmi 12 Phones: మార్కెట్‌లోకి రెడ్‌మీ 12 ఫోన్లు.. తక్కువ ధరల్లో అదిరిపోయే ఫీచర్లు..

రెడ్‌మీ నోట్ 12 4జీ, రెడ్‌మీ 12 సీ పేర్లతో ఈ ఫోన్లు వినియోగదారులకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా రెడ్ మీ 12 సీ ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Redmi 12 Phones: మార్కెట్‌లోకి రెడ్‌మీ 12 ఫోన్లు.. తక్కువ ధరల్లో అదిరిపోయే ఫీచర్లు..
Redmi
Follow us

|

Updated on: Apr 01, 2023 | 3:30 PM

మధ్య తరగతి ప్రజలను ద‌ృష్టిలో పెట్టుకుని ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్‌మీ మరో కొత్త ఫోన్‌లు తీసుకువస్తుంది. తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. రెడ్‌మీ నోట్ 12 4జీ, రెడ్‌మీ 12 సీ పేర్లతో ఈ ఫోన్లు వినియోగదారులకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా రెడ్ మీ 12 సీ ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ లైనప్‌ను మరింత విస్తరించడానికి ఇప్పుడు ఈ ఫోన్‌ను 4 జీలో తీసుకువచ్చి మరింతమంది కస్టమర్లను ఆకట్టుకుంటుంది. కొనుగోలు సిద్ధంగా ఉన్న ఈ రెండు ఫోన్లు ఫీచర్లు, ధర, లభ్యత గురించి ఓ సారి తెలుసుకుందాం.

రెడ్‌మీ నోట్ 12 4జీ

రెడ్‌మీ నోట్ 12 4 జీ ఫోన్ 6.67 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ముఖ్యంగా ఫోన్ మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. ప్యానెల్ 1,200 నిట్స్ గరిష్ట స్థాయికి చేరుకోగలదు. అలాగే 240 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేటుకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 183.5 గ్రాముల బరువు ఉంటుంది. అలాగే ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌ ఈ ఫోన్ ప్రత్యేకత. నలుపు, నీలం, బంగారు రంగుల్లో ఉండే ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 685 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ మరింత స్పీడ్‌గా పని చేయనుంది. అలాగే 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 50 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు 13 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఆకట్టుకునేలా ఫోన్ ఉంది. 6జీబీ+64 జీబీ, 6 జీబీ+128 జీబీ వేరియంట్లల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 

రెడ్‌మీ 12 సీ

రెడ్‌మి 12సీ ఫోన్‌లో టెక్స్‌చర్డ్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. స్లిప్-రెసిస్టెంట్ గ్రిప్‌తో వచ్చే ఈ ఫోన్ బరువు 192గ్రాములు ఉంటుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వెనుకవైపు ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో ఈ ఫోన్ డిజైన్ ఆకట్టుకుంటుంది. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.71 అంగుళాల డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. మీడియాటెక్ హీలియో జీ 85 ప్రాసెసర్‌‌తో వచ్చే ఈ ఫఓన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పని చేస్తుంది. అలాగే 10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే వెనుక వైపు 50 ఎంపీ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్పీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ ఫోన్ 4 జీబీ+ 64 జీబీ, 6 జీబీ+ 128 జీబీ వేరియంట్లల్లో అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 6 నుంచి అందుబాటులో..

రెడ్ మీ 12 సీ 4జీబీ+64 జీబీ ధర రూ.8,999 నుంచి ప్రారంభమవుతుంది. 6 జీబీ+ 128 జీబీ మోడల్ రూ.10,999కు అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.500 తగ్గింపు లభిస్తుంది. అలాగే నోట్ 12 4 జీ 6 జీబీ+64 జీబీధర రూ.14,999గా ఉంటే, 6 జీబీ+ 128 జీబీ ధర రూ.16,999గా ఉంటుంది. అయితే ఈ ఫోన్ ఐసీఐసీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 లాయల్టీ బోనస్ వస్తుంది. అలాగే ఈ రెండు ఫోన్లు ఏప్రిల్ 6 నుంచి కొనుగోలు అందుబాటులో ఉంటాయి. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..