Noise Colorfit Pulse 3: మార్కెట్‌లోకి దూసుకొస్తున్న నాయిస్ నయా స్మార్ట్ వాచ్.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..!

ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ అయిన నాయిస్ తాజా ఓ కొత్త స్మార్ట్ వాచ్‌తో మన ముందుకు వచ్చింది. 2.5 డీ కర్వ్డ్ డిజైన్‌తో నాయిస్ కలర్ ఫిట్ పల్స్ 3 పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వాచ్‌ను భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు పేర్కొంటున్నారు.

Noise Colorfit Pulse 3: మార్కెట్‌లోకి దూసుకొస్తున్న నాయిస్ నయా స్మార్ట్ వాచ్.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..!
Noise
Follow us
Srinu

|

Updated on: May 18, 2023 | 3:45 PM

భారతదేశంలో క్రమేపి స్మార్ట్ యాక్ససరీస్ వినియోగం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకునేలా ఈ యాక్ససరీస్ రావడంతో ఎక్కువ మంది యువత వీటిపై మోజు పడుతున్నారు. ముఖ్యంగా ఈ స్మార్ట్‌యాక్ససరీస్‌లో స్మార్ట్ వాచ్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. యువతను కూడా అధిక సంఖ్యలో ఆకట్టుకునేందుకు వివిధ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ స్మార్ట్ వాచ్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ అయిన నాయిస్ తాజా ఓ కొత్త స్మార్ట్ వాచ్‌తో మన ముందుకు వచ్చింది. 2.5 డీ కర్వ్డ్ డిజైన్‌తో నాయిస్ కలర్ ఫిట్ పల్స్ 3 పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వాచ్‌ను భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు పేర్కొంటున్నారు. ధర కూడా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా నిర్ణయించినట్లు వివరిస్తున్నారు. ఈ నాయిస్ కలర్ ఫిట్ పల్స్-3 ధర, ఫీచర్లు ఏంటో ఓ సారి పరిశీలిద్దాం.

నాయిస్ కలర్ ఫిట్ పల్స్-3 వాచ్ గురించి నాయిస్ సహ వ్యవస్థాపకుడు అమిత్ ఖత్రీ మాట్లాడుతూ ఈ వాచ్ వినియోగదారుల రోజువారీ దినచర్యను మెరుగుపర్చడమే లక్ష్యంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. నాయిస్ కలర్ ఫిట్ పల్స్-3 వాచ్ 1.96 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. అలాగే 550 నిట్స్ బ్రైట్ నెస్‌తో కర్వ్డ్ స్క్రీన్‌తో వస్తుంది. డీఎన్‌డీ సర్వీస్‌తో పాటు బహుళ మెనూ ఎంపికలు, ఆటో స్పోర్ట్స్ డిటెక్షన్, ట్రూ సింక్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది. ముఖ్యంగా ఈ వాచ్ బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్‌తో లోడ్ చేశారు. అలాగే డయల్ ప్యాడ్‌ను వినియోగించి డైరెక్ట్‌గా కాల్ చేయడంతో పాటు కాల్ హిస్టరీని కూడా తనిఖీ చేయవచ్చు. అలాగే 10 నెంబర్ల వరకూ సేవ్ చేసుకునేే అవకాశం కూడా ఉంది. యూజర్లను ఆకట్టుకోవడానికి ఈ వాచ్‌లో 170కి పైగా వాచ్ ఇంటర్‌ఫేస్‌లతో వస్తుంది. అలాగే ఈ వాచ్‌లో 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. అలాగే వాచ్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 7 రోజుల వరకూ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. రోజువారీ రిమైండర్లు, ఆరోగ్య రిమైండర్లతో పాటు వాతావరణ రిమైండర్లను పొందవచ్చు. ఈ వాచ్ ధర రూ.1799గా కంపెనీ నిర్ణయించింది. అలాగే ఈ వాచ్ అమెజాన్‌తో పాటు నాయిస్ కంపెనీ వెబ్‌సైట్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..