Solar Storm: సూర్యుని మధ్యలో అతిపెద్ద రంధ్రం.. ఉపరితలంపై భారీ విస్ఫోటనం.. వెల్లడించిన శాస్త్రవేత్తలు

Solar Storm: ఆకాశంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అప్పుడ్పుడు అద్భుతాలను చూస్తుంటాము. సూర్యుడిలో ప్రతి నిత్యం విస్ఫోటనాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే..

Solar Storm: సూర్యుని మధ్యలో అతిపెద్ద రంధ్రం.. ఉపరితలంపై భారీ విస్ఫోటనం.. వెల్లడించిన శాస్త్రవేత్తలు
Solar Storm
Follow us

|

Updated on: Jul 22, 2022 | 8:42 PM

Solar Storm: ఆకాశంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అప్పుడ్పుడు అద్భుతాలను చూస్తుంటాము. సూర్యుడిలో ప్రతి నిత్యం విస్ఫోటనాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే కొన్ని విస్ఫోటాలు మాత్రం భారీగా ఉంటాయి. వీటి నుంచి ఊహించనంత శక్తి విడుదలవుతుంటుంది. అలాంటి విస్ఫోటనం సూర్యుడిలో సంభవించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ఎఫెక్ట్‌ సౌరశక్తి సునామీలా వెళ్తోందని తెలిపారు. జూలై 23 భూ వాతావరణాన్ని తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

ఈ విస్ఫోటనం కారణంగా ఈ సౌర సునామీ తరంగాలు భూ అయస్కాంతాన్ని అతి వేగంగా ఢీకొట్టే అవకాశం ఉందంటున్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ కోల్‌కతా ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ స్పేస్‌ సైన్స్‌ సూర్యుని మధ్య భాగంలో రంధ్రాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. అంతరిక్షంలో ఇది చాలా దూరం వ్యాపిస్తుంది. కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ అనేది సూర్యుని ఉపరితలం నుంచి వచ్చే అతిపెద్ద విస్ఫోనాలలో ఒకటి. ఇది గంటకు అనేక మిలియన్‌ మైళ్ల వేగంతో ఒక బిలియన్‌ టన్నుల పదార్థాన్ని అంతరిక్షంలోకి నెట్టగలదు. జూలై 21న తెల్లవారుజామున సన్‌స్ఫోట్‌ AR3060 విస్ఫోటనం చెందింది. దీని వల్ల సోలార్‌ ఫ్లేర్‌, సౌర సునామీ ఏర్పడింది. NASA సోలార్‌ డైనమిక్స్‌ అబ్బర్వేటరీ ద్వారా ఈ విస్ఫోటనాన్ని గమనించారు. అయితే దీని కారణంగా సౌర తుపాను గాలులు వెలువడే ప్రమాదం ఉందని, భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?