- Telugu News Photo Gallery Technology photos Redmi launch new 5g smartphone Redmi K50i 5G price and features Telugu Tech News
Redmi K50i 5G: రెడ్‌మీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. 64 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్లు..
Redmi K50i 5G: భారత మార్కెట్లోకి మరో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. త్వరలోనే 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తోన్న నేపథ్యంలో రెడ్‌మీ కే50ఐ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. నేటి నుంచి సేల్ ప్రారంభంకానున్న ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Jul 22, 2022 | 6:50 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ కే 50ఐ పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ ఫోన్‌లో థర్మల్ మేనేజ్‌మెంట్ కూలింగ్ చాంబర్‌ను ప్రత్యేకంగా ఇచ్చారు. దీంతో ఫోన్ వేడెక్కదు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో ఐపీ53 రేటింగ్‌తో కూడిన డస్ట్, వాటర్ రెసిస్టెంట్ అందించారు. అమెజాన్‌తో పాటు ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో జులై 23 ఉదయం 12 గంటల వరకు సేల్ ప్రారంభమవుతుంది.

ఇక రెడ్‌మీ కే50ఐలో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 8100 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5080 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

డాల్బీ అట్మోస్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను అందించిన ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ధర రూ. 25,999, 8 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ ధర రూ. 28,999గా ఉన్నాయి.





























