Photoshop: గుడ్‌న్యూస్.. డౌన్‌లోడ్ చేయకుండానే ఫొటోషాప్ వాడొచ్చు.. ఏడాది పాటు ఫ్రీ.. ఎలా అంటే..?
ఫొటోషాప్ సేవలు అందించే అడోబ్ సంస్థ నుంచి కీలక ప్రకటన వచ్చింది. కొత్తగా గూగుల్ ఎక్స్‌టెన్షన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోకుండానే ఫొటోషాప్ ఆన్‌లైన్‌లో వాడుకోవచ్చు. ఇది ఎంతోతమందికి ఉపయోగకరంగా ఉంటుందని అడోబ్ ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే..

ఫొటోషాప్ గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. ఫొటోలు ఆకర్షణీయంగా ఎడిట్ చేసుకోవడానికి అద్బుతమైన టూల్ ఇది. ఫొటోలను ఎడిట్ చేసుకోవడానికి రకరకాల ఆప్షన్లు ఇందులో ఎన్నో ఉంటాయి.దీంతో ఈ టూల్ చాలామంది వాడే ఉంటారు. ఇక గ్రాఫిక్ డిజైనర్స్‌కి అయితే ఈ టూల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రోజువారీ తమ పనిలో ఎంతోమంది ఫొటోషాప్ వాడుతూ ఉంటారు. ఇప్పటివరకు ఫొటోషాప్ వాడాలంటే దానిని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇన్‌స్టాల్ చేసుకున్నాక మాత్రమే మనం ఫొటోషాప్ మీ సిస్టమ్ లేదా ల్యాప్‌టాప్‌లో వాడుకోవానికి వీలు ఉంటుంది. కానీ ఇక నుంచి ప్రత్యేకంగా ఫొటోషాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పని లేనే లేదు. సులువుగా క్రోమ్ ఎక్స్‌టెన్షన్ రూపంలో ఫొటోషాప్ వాడుకోవచ్చు.
ఫ్రీగా ఎలా అంటే..?
ఫొటోషాప్‌ను మీరు ఫ్రీగా క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ఫైల్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అ తర్వాత వెబ్ బ్రౌజర్‌లోకి వెళ్లి ఫొటోషాప్ సులువుగా వినియోగించుకోవచ్చు. ఇక క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడేవారికి అడోబ్ మంచి అవకాశం కల్పిస్తోంది. డిసెంబర్ 9లోపు ఎక్స్‌టెన్షన్‌ను డౌన్లోడ్ చేసుకున్నవారికి ఏడాది పాటు ఫ్రీగా ఫొటోషాప్ వాడుకోవచ్చని తెలిపింది. ఎక్స్‌టెన్షన్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు జోడిస్తామని, మరింత మెరుగుపరుస్తామని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో వేరే లైట్ వెయిట్ టూల్స్ వాడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఎక్కడ పొందాలి..?
గూగుల్ క్రోమ్‌లోకి వెళ్లి ఫొటోషాప్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ అని సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే క్రోమ్ వెబ్‌స్టోర్‌లోకి వెళ్లి పొందవచ్చు. ఈ రెండు ఆప్షన్ల ద్వారా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాలో పెట్టే పోస్టులకు మీరు సులువుగా దీని ద్వారా ఫొటోలు ఎడిట్ చేసుకోవచ్చు.




