AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone: మీ స్మార్ట్​ఫోన్ హ్యాక్​ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే.. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి అతిపెద్ద కారణం ఏమిటంటే, ప్రజలు స్మార్ట్‌ఫోన్ నుండి చాలా సౌకర్యాలను పొందుతున్నారు.

Smartphone: మీ స్మార్ట్​ఫోన్ హ్యాక్​ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే.. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
Smartphone
Madhavi
| Edited By: |

Updated on: Mar 21, 2023 | 10:35 AM

Share

గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి అతిపెద్ద కారణం ఏమిటంటే, ప్రజలు స్మార్ట్‌ఫోన్ నుండి చాలా సౌకర్యాలను పొందుతున్నారు. చాలా వ్యాపారాలు స్మార్ట్ ఫోన్ మీదనే జరిగిపోతున్నాయి. ప్రజలు తమ దైనందిన జీవితానికి సంబంధించిన సగానికి పైగా పనిని స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే నిర్వహిస్తారు. ఆన్‌లైన్ షాపింగ్ అయినా, పేమెంట్ అయినా లేదా ఏదైనా టికెట్ బుకింగ్ అయినా, ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంట్లో కూర్చొని ఈ పనులన్నీ చేసేస్తున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ మనుషులకు వరం అని చెప్పడంలో తప్పులేదు. అయితే ఒకవైపు దీని వినియోగం పెరిగిన చోట.. మరోవైపు దీని వల్ల ప్రజల సీక్రెట్ సమాచారం కూడా దుర్వినియోగం కావడం మొదలైంది. సైబర్ మోసగాళ్లు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను టార్గెట్ చేసి వారి ఫోన్ లోని కీలక సమచారంతో హ్యాకింగ్ చేసి అకౌంటు నుంచి డబ్బులు కొట్టేయడం లాంటి పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. లేదా మరేదైనా పర్సనల్ సమాచారం వారి చేతికి చిక్కినా వారు ప్రజలను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇటీవల మీ ఫోన్ దొంగిలించకుండానే హ్యాకింగ్ చేసే వీలుంది. ఈ సమస్యను ఎలా గుర్తించాలి. దీన్నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.

ఫోన్ హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించాలి…

  1. స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా పేమెంట్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ పేమెంట్ యాప్స్ వాడవద్దు.
  2. ఇది కాకుండా, మీకు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా లింకులను టచ్ చేయవద్దు. అలాగే, అనుమానాస్పద లింక్‌లు, అనుమానాస్పద మెయిల్‌లు అటాచ్‌మెంట్‌లపై క్లిక్ చేయవద్దు.
  3. ఇవి కూడా చదవండి
  4. స్మార్ట్‌ఫోన్‌ను క్రమం తప్పకుండా సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తుండాలి. ఇది మాల్‌వేర్‌ను తీసివేయడంలో లేదా దానికి నష్టం కలిగించడంలో సహాయపడుతుంది.
  5. కొందరు ఆగంతుకులు ఫోన్ చేసి ఓటీపీ నెంబర్ చెప్పమని అడుగుతుంటారు. అలాంటి పనులు చేయకండి. అలాగే విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను బ్లాక్ చేయండి.
  6. మీకు అవసరం లేనప్పుడు మొబైల్ డాటాను ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీ ఫోన్ హ్యాక్ కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ప్లేస్టోర్ కాకుండా బయట లింకుల నుంచి యాప్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్ లోడ్ చేయవద్దు.
  7. విదేశీ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే వాటిని ఆన్సర్ చేయకండి. అలా చేస్తే మీరు చిక్కుల్లో పడ్డట్టే అని గుర్తుంచుకోండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..