Nokia C12: రూ. 6వేలలో స్మార్ట్‌ఫోన్.. అదికూడా నోకియా బ్రాండ్. ఫీచర్లు కూడా సూపర్.
ఒకప్పుడు మొబైల్ ఫోన్స్‌కి పెట్టింది పేరైన నొకియా ఆ తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో యూజర్ల ముందుకు వచ్చింది. అయితే ఈ ఫోన్‌లు అంతలా క్లిక్ అవ్వలేదనే చెప్పాలి. అయితే అనంతరం ఆండ్రాయిడ్ ఓఎస్‌తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి..
ఒకప్పుడు మొబైల్ ఫోన్స్‌కి పెట్టింది పేరైన నొకియా ఆ తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో యూజర్ల ముందుకు వచ్చింది. అయితే ఈ ఫోన్‌లు అంతలా క్లిక్ అవ్వలేదనే చెప్పాలి. అయితే అనంతరం ఆండ్రాయిడ్ ఓఎస్‌తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది నోకియా. ఆ తర్వాత వరుసగా స్మార్ట్‌ఫోన్స్‌ని విడుదల చేస్తూ వస్తోంది నోకియా. అటు ప్రీమియం మార్కెట్‌తో పాటు, ఇటు బడ్జెట్ మార్క్‌ను సైతం నోకియా క్యాష్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లంచ్ చేసింది.
నోకియా సీ12 పేరుతో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ. 5999 కావడం విశేషం. డార్క్ సియాన్, చార్‌కోల్, లైట్ మింట్ కలర్స్‌లలో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 17వ తేదీ నుంచి ఈ కామర్స్‌సైట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో. 2జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. అలాగే 6.3 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. బ్రైట్‌నెస్ బూస్ట్, సెల్ఫీ నాచ్‌ను అందించారు.
నోకియా సీ 12 Unisoc 9863A1 ఆక్టాకోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 5W చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 3000mAh బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 12గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌కు.. దమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP52 రేటింగ్ ఇచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..