Laptop: ఏ బంటి.. నీ లాప్‌టాప్‌ స్లోనా ఏంటీ.? ఇలా చేస్తే జెట్ స్పీడ్‌..

ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ వినియోగం అనివార్యంగా మారింది. స్కూల్కు వెళ్లే చిన్నారుల నుంచి ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల వరకు కచ్చితంగా ల్యాప్‌టాప్‌ ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తొలుత వేగంగా పనిచేసే ల్యాప్‌టాప్‌లు కాలక్రమేణా వేగం తగ్గుతాయి. దీంతో ల్యాప్‌టాప్‌ ఉపయోగించే సమయంలో చిరాకుగా ఉంటుంది. అయితే కొన్ని రకాల సింపుల్‌ చిట్కాలు...

Laptop: ఏ బంటి.. నీ లాప్‌టాప్‌ స్లోనా ఏంటీ.? ఇలా చేస్తే జెట్ స్పీడ్‌..
Laptop
Follow us

|

Updated on: Jun 17, 2024 | 9:17 AM

ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ వినియోగం అనివార్యంగా మారింది. స్కూల్కు వెళ్లే చిన్నారుల నుంచి ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల వరకు కచ్చితంగా ల్యాప్‌టాప్‌ ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తొలుత వేగంగా పనిచేసే ల్యాప్‌టాప్‌లు కాలక్రమేణా వేగం తగ్గుతాయి. దీంతో ల్యాప్‌టాప్‌ ఉపయోగించే సమయంలో చిరాకుగా ఉంటుంది. అయితే కొన్ని రకాల సింపుల్‌ చిట్కాలు పాటించడం ద్వారా ల్యాప్‌టాప్‌ను మళ్లీ పరుగులు పెట్టించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మొదట్లో వేగంగా పనిచేసిన ల్యాప్‌టాప్‌ కాలక్రమేణ వేగం తగ్గడానికి ప్రధాన కారణాల్లో క్యాచీ మెమొరీ ఒకటి. ఎంత ఖరీదైన ల్యాప్‌టాప్‌ అయినా సరేనా కాలం గడుస్తున్న కొద్దీ ల్యాప్‌టాప్‌ వేగం క్యాచ్‌ మెమోరీ ద్వారానే తగ్గుతుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* మెమోరీని క్లియర్‌ చేయడం ద్వారా ల్యాప్‌టాప్‌ వేగాన్ని పెంచుకోవచ్చు. ఇందుకోసం ముందుగా స్టార్ట్ మెనుని ఓపెన్ చేసి డిస్కన్ క్లీనప్‌ను సెర్చ్‌ చేయాలి. ఆ తర్వాత డ్రైవ్‌ను ఎంచుకుని, ఓకేపై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఫైల్‌లో టెంపరరీ ఫైల్స్‌తో పాటు ఇతర క్యాచ్‌ ఫైల్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. చివరిగా ఓకేపై క్లిక్‌ చేసి, ఫైల్స్ డిలీట్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

* మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లోని క్యాచ్‌ మెమోరీని డిలీట్ చేయడం ద్వారా కూడా స్పీడ్ పెంచొచ్చు. ఇందుకోసం ముందుగా ఎడ్జ్‌ని ఓపెన్‌ చేయండి. ఆపై కుడివైపు ఎగువన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి, సెట్టింగ్‌లోకి వెళ్లాలి. అనంతరం ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాలి. తర్వాత బ్రౌజింగ్‌ డేటా క్లియర్‌ విభాగంలో ఏది క్లియర్‌ చేయాలి సెలక్ట్‌ చేసుకోవాలి. టైమ్ రేంజ్‌లో ఆల్ టైమ్ ఎంచుకుని, కాష్ చేసిన ఇమేజ్‌లు, ఫైల్స్ ఆప్షన్‌ని టిక్‌ చేయండి. చివరగా ‘క్లియర్‌ నౌ’ బటన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

* రన్ కమాండ్ ద్వారా క్యాచ్‌ మెమోరీని క్లియర్‌ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా రన్ డైలాగ్ బాక్స్‌ను తెరవడానికి Windows + R నొక్కాలి. ఆ తర్వాత temp అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఆపై అన్ని ఫైల్‌లను ఎంచుకొని డిలీట్ చేస్తే సరిపోతుంది. అనంతరం మళ్లీ రన్ ఓపెన్ చేసి, %temp% అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అన్ని ఫైల్‌లను ఎంచుకుని, వాటిని తొలగించండి. రన్‌ని మరోసారి తెరిచి, ప్రిఫెచ్ అని టైప్ చేసి, ఆపై ఎంటర్ నొక్కండి. అన్ని ఫైళ్లను సెలక్ట్ చేసుకొని డిలీట్ చేస్తే సరిపోతుంది.

* గూగుల్ క్రోమ్‌లో ఉండే క్యాచ్‌ మెమోరీ కూడా ల్యాప్‌టాప్‌ స్లోగా మారడానికి కారణమవుతుంది. దీనిని క్లిరయ్‌ చేయడానికి క్రోమ్‌ను ఓపెన్‌ చేసిన పైన ఉండే మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి. అందులో బ్రౌజింగ్ డేటా క్లియర్ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. తర్వాత టైమ్‌ సెక్షన్‌లో ఆల్‌ టైమ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాచీ మెమోరీ ఉన్న ఫొటోలు, ఫైల్స్‌ను సెలక్ట్ చేసుకొని క్లియర్‌ డేటా బటన్‌పై నొక్కితో సరిపోతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..