Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారని డౌట్‌గా ఉందా.? ఇలా చెక్‌ చేసుకోండి..

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లతో దూసుకుపోతోంది ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌. మరీ ముఖ్యంగా యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌కు ఇంతటి క్రేజ్‌ ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మన అప్‌డేట్స్‌ కొందరికి కనిపించకూడదనే ఉద్దేశంతో బ్లాక్‌ చేస్తుంటారు...

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారని డౌట్‌గా ఉందా.? ఇలా చెక్‌ చేసుకోండి..
Instagram Block
Follow us

|

Updated on: Jun 17, 2024 | 8:53 AM

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లతో దూసుకుపోతోంది ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌. మరీ ముఖ్యంగా యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌కు ఇంతటి క్రేజ్‌ ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మన అప్‌డేట్స్‌ కొందరికి కనిపించకూడదనే ఉద్దేశంతో బ్లాక్‌ చేస్తుంటారు. అయితే మనల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరు బ్లాక్‌ చేశారో, తెలుసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.? ఇంతకీ ఇన్‌స్టాలో మిమ్మల్ని ఎవరు బ్లాక్‌ చేశారో ఇలా తెలుసుకోండి..

* మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారో తెలుసుకోవాలంటే ముందుగా మెసేజెస్‌ సెక్షన్‌లోకి వెళ్లాలి. అనంతరం సదరు వ్యక్తి ప్రొఫైల్‌ను ఓపెన్‌ చేయాలి. ఒకవేళ ప్రొఫైల్‌ పిక్చర్‌ లేకుండా వారి యూజర్‌ నేమ్‌ కనిపిస్తే.. వారి పోస్టలును చూడలేకపోతే మీరు బ్లాక్‌ అయినట్లు అర్థం చేసుకోవచ్చు.

* సెర్చ్‌ ఫంక్షన్‌ని ఉపయోగించే మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారో తెలుసుకోవచ్చు. సెర్చ్‌లో మీకు వారి ప్రొఫైల్ కనిపించకపోతే బ్లాక్‌ చేసినట్లు అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ప్రొఫైల్‌ ప్రైవేట్‌గా ఉన్నా ప్రొఫైల్‌ కనిపించదని గుర్తుపెట్టుకోండి.

* ఎవరైనా మిమ్మల్ని బ్లాక్‌ చేశారనే అనుమానంగా ఉంటే మరో అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఆ అకౌంట్‌ నుంచి సదరు ఐడీని సెర్చ్‌ చేస్తే కనిపిస్తే మిమ్మల్ని బ్లాక్‌ చేసినట్లే అర్థం చేసుకోవాలి.

* బ్రౌజర్‌లో సదరు వ్యక్తి యూజర్ ప్రొఫైల్‌ని సెర్చ్‌ చేయండి. instagram.com/usernameతో ఎంటర్ చేస్తే పేజీ అందుబాటులో లేదని సందేశం వస్తే మీరు బ్లాక్‌ అయినట్లే.

* ఇక మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారో లేదో తెలసుకోవాలంటే.. యూజర్‌​ని మళ్లీ ఫాలో చేసేందుకు ప్రయత్నించండి. కొన్ని సెకన్ల తర్వాత “ఫాలో” బటన్ మళ్లీ “ఫాలో” కు తిరిగి వస్తే.. మిమ్మల్ని బ్లాక్​ చేసినట్టు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..